యూపీలో నాలుగో విడత ఎన్నికలు కొనసాగుతున్నాయి. ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాల వద్దకు భారీగా తరలివస్తున్నారు. దీంతో ఉదయం 9 గంటలకే 9.10శాతం పోలింగ్ నమోదు అయ్యింది. 59 అసెంబ్లీ నియోజక వర్గాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. మొత్తం 624 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని నిర్ణయిస్తారు ఓటర్లు. కాంగ్రెస్ పార్టీకి, గాంధీ కుటుంబానికి కంచుకోటగా ఉన్న రాయ్‌బరేలీ నియోజకవర్గంలో కూడా ఎన్నికలు జరుగుతున్నాయి. లఖీంపూర్ ఖేరీ ఘటన జరిగిన ప్రాంతంలో కూడా ఎన్నికలు సజావుగా సాగుతున్నాయి. పోలింగ్ జరుగుతున్న ప్రాంతాల్లో పోలీసులు పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేశారు. 2017లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 59 నియోజక వర్గాల్లో 51 చోట్ల బీజేపీ విజయం సాధించింది. 4 చోట్ల ఎస్పీ, రెండు చోట్ల బీఎస్పీ, మరో రెండు స్థానాలను కాంగ్రెస్ కైవసం చేసుకున్నాయి. బీజేపీ మిత్రపక్షం అప్నా దళ్ ఒక సీటు గెలుచుకుంది.
మరిన్ని వార్తల కోసం