కారులోకి మార్చుతూ దొరికిన్రు.. హైదరాబాబాద్‎లో యూపీ గంజా గ్యాంగ్ గుట్టురట్టు

కారులోకి మార్చుతూ దొరికిన్రు.. హైదరాబాబాద్‎లో యూపీ గంజా గ్యాంగ్ గుట్టురట్టు
  •  అరకు నుంచి మహారాష్ట్ర, యూపీకి గంజాయి సప్లయ్‌‌‌‌
  • హైదరాబాద్‌‌‌‌ ఓఆర్‌‌‌‌‌‌‌‌ఆర్‌‌‌‌‌‌‌‌ మీదుగా తరలించేందుకు యత్నం
  • ఏడుగురు సభ్యుల యూపీ గ్యాంగ్‌‌‌‌లో ఐదుగురు అరెస్ట్
  • రూ.88.90 లక్షలు విలువైన గాంజా, కార్లు, రివాల్వర్ స్వాధీనం‌‌‌‌

హైదరాబాద్‌‌‌‌, వెలుగు: యూపీకి చెందిన గంజాయి  గ్యాంగ్‌‌‌‌ హైదరాబాద్ పరిధి రాజేంద్రనగర్‌‎‌‌‌‌లో మంగళవారం హల్‌‌‌‌చల్‌‌‌‌ చేసింది. సైబరాబాద్‌‌‌‌ ఎస్‌‌‌‌ఓటీ  పోలీసులపై దాడికి యత్నించగా.. అలర్టై  ఏడుగురు సభ్యుల ముఠాలో ఐదుగురిని అరెస్ట్‌‌‌‌ చేశారు. గ్యాంగ్‌‌‌‌ వద్ద రూ.88.90 లక్షలు విలువైన 254 కిలోల గంజాయి, రెండు కార్లు, కంట్రీమేడ్ రివాల్వర్ స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ రూ.1.04 కోట్లు ఉంటుందని అంచనా వేశారు. పరారీలో ఉన్న  ఇద్దరి కోసం గాలింపు చేపట్టారు. పోలీసులపై గంజాయి గ్యాంగ్‌‌‌‌ కాల్పులు జరిపిందని ప్రచారంతో  సైబరాబాద్ పోలీసులు అలాంటిదేమి లేదని స్పష్టం చేశారు. రాజేంద్రనగర్ డీసీపీ సీహెచ్ శ్రీనివాస్ మీడియాకు వివరాలు వెల్లడించారు. 

రక్షణ కోసం కంట్రీమేడ్ రివాల్వర్‌‌‌‌   

యూపీలోని సుల్తాన్‌‌‌‌పూర్‌‌‌‌‌‌జిల్లాకు చెందిన ఠాకూర్‌‌‌‌‌‌‌‌సచిన్ సింగ్‌‌‌‌(30) జాన్‌‌‌‌పూర్‌‌‎కు చెందిన వినోద్‌‌‌‌కుమార్‌‌‌‌యాదవ్‌‌‌‌‌‌‌‌స్థానికంగా గంజాయి సప్లయర్లు. ఐదేండ్లుగా ఏపీలోని అరకు వ్యాలీ నుంచి మహారాష్ట్ర, యూపీకి గాంజా రవాణా చేస్తుండగా.. 3 నెలల కింద వీరు ఒడిశాకు చెందిన గంజాయి ఏజెంట్‌‌‌రాజు వద్ద 270 కిలోలు కొన్నారు. యూపీకి తీసుకెళ్లి ప్రతాప్‌‌‌‌ఘర్‌‏కు చెందిన అమిత్‌‌‌‌ సింగ్‌‌‌‌కు అమ్మారు. ఆ తర్వాత గన్స్ స్మగ్లింగ్ వ్యాపారి సునీల్ సింగ్‌‌‌‌ వద్ద ఠాకూర్ సింగ్‌‌‌‌ రూ.లక్షకు 0.32 ఎంఎం కంట్రీమేడ్  పిస్టల్,11  రౌండ్స్ బుల్లెట్స్‌‌‌‌ కొన్నాడు. 

నంబర్ ప్లేట్ మార్చుతూ..

ముంబయి నుంచి వెళ్లిన రెండు కార్లలో గంజాయి తెస్తున్నారు. సోమవారం అరకు నుంచి వస్తూ.. ఒక కారుకు ఒడిశా నంబర్ ప్లేట్‌‌‌‌అమర్చారు. అది గంజాయి ఉన్న కారుకు ఎస్కార్ట్‌‌‌‌గా ఉండగా..  మంగళవారం రాజేంద్రనగర్ ఓఆర్‌‌‌‌‌‌‌‌ఆర్‌‌‌‌‌‌‌‌పైకి ఎక్కి ఎగ్జిట్‌‌‌‌ 17 వద్ద సర్వీస్ రోడ్డులో కార్లను ఆపారు. మహారాష్ట్రకు తీసుకెళ్లే 100 కిలోల గంజాయిని మరో కారులోకి మార్చుతున్నారు.  అనుమానాస్పదంగా కనిపించడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో సైబరాబాద్ ఎస్‌‌‌‌ఓటీ డీసీపీ శ్రీనివాస్ ఆధ్వర్యంలో పోలీసులు వెళ్లగా ముఠాలోని వినోద్‌‌‌‌కుమార్‌‌, రవీందర్‌‌‌‌‌‌‌‌ యాదవ్‌‌‌‌ పారిపోయారు. ఠాకూర్ సింగ్‌‌‌, మహ్మద్ నదీమ్‌‌‌‌, మహ్మద్‌‌‌‌ సక్లైన్‌‌, మహ్మద్‌‌‌‌ సలీం, ప్రశాంత్‌‌‌‌ సింగ్‌‎ను పోలీసులు పట్టుకున్నారు. 

254 కిలోల గంజాయి తెచ్చేందుకు..

అరకు నుంచి గంజాయిని తెచ్చేందుకు ఠాకూర్ సింగ్ ముంబయిలో ఉండే యూపీ ప్రతాప్‌‌‌‌ఘర్‌‎కు చెందిన మహ్మద్ నదీమ్‌‌‌‌(21),మహ్మద్‌‌‌‌ సక్లైన్‌‌‌‌(24) మహ్మద్‌‌‌‌ సలీం(24) ప్రశాంత్‌‌‌‌ సింగ్‌‌‌‌(22)లను ఎస్కార్ట్‌‌‌‌గా నియమించుకున్నాడు. ఈ నెల 9న గంజాయిని అరకు నుంచి హైదరాబాద్ మీదుగా మహారాష్ట్రకు తీసుకెళ్లేందుకు ప్లాన్ చేసి ఎస్కార్ట్‌‌‌‌‎కు చెప్పగా..  ఎర్టిగా కారులో విజయవాడకు వెళ్లారు. అక్కడ సిద్ధంగా ఉన్న ఠాకూర్ సింగ్‌‌‌‌, వినోద్‌‌‌‌యాదవ్‌‌‌‌, రవీందర్ యాదవ్‌‌‌‌, ప్రశాంత్‌‌‌‌తో కలిసి ఈనెల7న అరకు వెళ్లారు. ఏజెంట్‌‌‌‌రాజు వద్ద 254 కిలోలు కొన్నారు. ఇందులో 150 కిలోలు యూపీలోని అమిత్‌‌‌‌ సింగ్‌‌‌‌కు మరో 100 కిలోలు ముంబయిలోని పెడ్లర్లకు అందించేందుకు ప్లాన్ చేసి దొరికిపోయారు.

జహీరాబాద్‎లో 140 కిలోలు స్వాధీనం పట్టివేత

జహీరాబాద్: 140 కిలోల ఎండు గంజాయిని పట్టుకున్నట్లు సంగారెడ్డి ఎస్పీ చెన్నూరి రూపేశ్​ తెలిపారు. మంగళవారం సంగారెడ్డి జిల్లా చిరాగ్ పల్లి పోలీస్ స్టేషన్ ఆవరణలో  మీడియాకు వివరాలు వెల్లడించారు.  సోమవారం రాత్రి చిరాగ్ పల్లిలోని ఆనంద్ దాబా ముందు హైవేపై తనిఖీ చేస్తుండగా బొలెరోలో తరలిస్తున్న గంజాయి పట్టుబడినట్లు తెలిపారు. 

కర్నాటకకు చెందిన లఖాన్, సిద్దిరాం వెహికల్ కింద భాగంలో చెక్కలను అమర్చి ఎండు గంజాయిని ఒడిశాలోని మల్కాన్ గిరి నుంచి మహారాష్ట్రకు తరలిస్తున్నట్టు చెప్పారు. నిందితులను అదుపులోకి తీసుకుని రూ. 35 లక్షల విలువవైన  140 కిలోల గంజాయి, బొలెరో వెహికల్‎ను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ తెలిపారు. జహీరాబాద్ డీఎస్పీ కె రామ్మోహన్ రెడ్డి, టౌన్ సీఐ శివలింగం, ఎస్బీ ఇన్స్​పెక్టర్​విజయ్ కృష్ణ పాల్గొన్నారు.