యూపీ సర్కార్ మరో కీలక నిర్ణయం.. ప్రభుత్వ ఉద్యోగులకు ఆగస్ట్ నెల జీతాలు ఆపేశారు

యూపీ సర్కార్ మరో కీలక నిర్ణయం.. ప్రభుత్వ ఉద్యోగులకు ఆగస్ట్ నెల జీతాలు ఆపేశారు

ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం ఆస్థి వివరాలు సమర్పించని రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు భారీ షాక్ ఇచ్చింది. ఆస్తి వివరాలు వెల్లడించని 2.45లక్షల మంది ఉద్యోగులకి ఆగస్టు నెల జీతాలను నిలిపివేసింది. ఉద్యోగులు ఆన్‌లైన్‌ వేదికగా తమ ఆస్తి వివరాలను ఆగస్టు 31 లోగా వెల్లడించాల్సి యూపీ సర్కార్ డెడ్ లైన్ విధించింది. అయితే ఆ తేదీని ఇప్పుడు సెప్టెంబర్ 30 వరకు పొడిగించింది. గడువు తేదీలోగా వివరాలను పొందుపరచకపోవడంతో ప్రభుత్వం ఈ కఠిన నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు 6లక్షల మంది గవర్నమెంట్ ఎప్లాయిస్ వారి ఆస్తుల వివరాలు ఆన్ లైన్ లో సబ్మిట్ చేశారు.

సీఎం యోగి ఆదిత్యనాథ్ సర్కారు తీసుకున్న ఈ నిర్ణయంతో 2,44,565 మంది ఉద్యోగులకు ఆగస్టు నెల జీతాలు పడలేదని వివిధ ప్రభుత్వ విభాగాల రిపోర్టులు పేర్కొన్నాయి. కాగా సెప్టెంబర్ 30లోగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు అందరూ తమ ఆస్తుల వివరాలను అధికారిక పోర్టల్‌లో అప్‌లోడ్ చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. 71 శాతం మంది ఉద్యోగులు మాత్రమే సమాచారాన్ని అప్‌లోడ్ చేశారని ప్రభుత్వ నివేదికలు చెబుతున్నాయి. కాగా ఐఏఎస్‌, ఐపీఎస్‌‌ల తరహాలో రాష్ట్ర స్థాయి ఉద్యోగులు అందరూ ఆస్తుల వివరాలు తెలియపరచడాన్ని అక్కడి ప్రభుత్వం తప్పనిసరి చేసిన విషయం తెలిసిందే.