రైతులకు గుడ్​న్యూస్​:  పంటనష్ట పరిహారం అడ్వాన్స్​ గా రూ. 23కోట్లు

ప్రతి ఏడాది ప్రకృతి వైపరీత్యం వలన రైతన్నలకు వచ్చే నష్టం అంతా ఇంతా కాదు.  ఒక ఏడాది వర్షాలు పడక నష్టపోతే.. మరో ఏడాది పంట చేతికొచ్చే సమయానికి అకాల వర్షాలు పడి.. అన్నదాతలను అప్పుల ఊబిలోకి కూరుకుపోతున్నారు. ప్రభుత్వాలు ఒకరికో.. ఇద్దరికో సాయం చేసి చేతులు దులుపుకొనే పరిస్థితి.  దీంతో  యూపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.   దీంతో రైతులకు ఎంతో ఊరట లభించనుంది.  పంట నష్టపరిహారం కింద అడ్వాన్స్​ గా రూ. 23 కోట్లు మంజూరు చేసేందుకు సీఎం యోగి ఆమోదం తెలిపారు.  అధిక వర్షపాతం.. వడగళ్ల వాన కారణంగా నష్టపోయిన తొమ్మిది జిల్లాల రైతులకు పంపిణీ చేసేందుకు ప్రభుత్వం సిద్దంగా ఉన్నట్లు ప్రకటించింది. 

పంట నష్టంపై నివేదిక వచ్చిన తరువాత రోజే అడ్వాన్స్​గా రూ. 23 కోట్లు మంజూరు చేయడంతో త్వరలోనే రైతులకు పరిహారం అందే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. బందా, బస్తీ, చిత్రకూట్, జలౌన్, ఝాన్సీ, లలిత్‌పూర్, మహోబా, సహరాన్‌పూర్ తదితర జిల్లాలకు నిధులు మంజూరయ్యాయి.. ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం బండకు రూ.2 కోట్లు, బస్తీకి రూ.2 కోట్లు, చిత్రకూట్‌కు రూ.1 కోట్లు, జలౌన్‌కు రూ.5 కోట్లు, ఝాన్సీకి రూ.2 కోట్లు, లలిత్‌పూర్‌కు రూ.3 కోట్లు, మహోబాకు రూ.3 కోట్లు, రూ.3 కోట్లు. సహరాన్‌పూర్‌కు కోటి.. షామ్లీకి రూ.3 కోట్లు, రూ.2 కోట్లు మంజూరయ్యాయయని  రిలీఫ్‌ కమిషనర్‌ జీఎస్‌ నవీన్‌ తెలిపారు. 

ALSO READ :- జర్నలిస్టులు ఎల్లప్పుడూ ప్రతిపక్షమే: రేవంత్ రెడ్డి

పరిహారం సొమ్మును తక్షణమే రైతుల ఖాతాల్లో జమచేయాలని సీఎం యోగి వ్యవసాయ శాఖను ఆదేశించారు. ప్రభుత్వం ఆదేశాల మేరకు ప్రతికూల వాతావరణంతో దెబ్బతిన్న పంటలకు నష్టపరిహారం అందజేస్తామని రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీ పి.గురు ప్రసాద్ తెలిపారు. ప్రతికూల వాతావరణం కారణంగా, రాష్ట్రంలోని తొమ్మిది జిల్లాల్లో అధిక వర్షపాతం మరియు వడగళ్ల వాన కారణంగా పంటలు గరిష్టంగా దెబ్బతిన్నాయని రిలీఫ్ కమిషనర్ తెలిపారు. . వరదలు, వడగళ్ల వానలు, అకాల వర్షాల వల్ల 33 శాతానికి పైగా పంటలు నష్టపోయిన రైతులకు మాత్రమే పరిహారం అందజేస్తామనని రిలీఫ్‌ కమిషనర్‌ తెలిపారు.

గొట్టపు బావికి ఉచిత విద్యుత్

రైతుల విషయంలో యూపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది.  రైతులు ఉపయోగించే గొట్టపు బావులకు ఉచిత విద్యుత్​ సరఫరా చేసేందకు కేబినెట్​ ఆమోదం తెలిపింది. 2022 ఎన్నికల మేనిఫెస్టోలో ఉచిత విద్యుత్​ హామీ ఇచ్చింది. ఈ స్కీం రైతులకు పెద్ద బహుమతి అని సీఎం యోగి ప్రభుత్వం భావిస్తోంది. ఇది ఆచరణ యోగ్యం అయితే రైతులకు పెద్ద ఊరట కలుగుతుంది.  యూపీలో దాదాపు 2.5 కోట్ల మంది రైతులు ఉన్నారు.  వీరిలో 1.5 కోట్ల మంది రైతులు గొట్టపు బావి ద్వారా పంటలు పండించుకుంటున్నారు.