ఉత్తరప్రదేశ్: యోగి ఆదిత్యానాథ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. విద్యార్థుల హాజరు శాతం తక్కువుగా ఉన్న ప్రభుత్వ పాఠశాలలను మూసివేయాలని నిర్ణయించింది. ముఖ్యంగా, 50 కంటే తక్కువ మంది విద్యార్థులు హాజరవుతున్న పాఠశాలలను మూసివేయాలని యోచిస్తోంది.
ఈ నిర్ణయం విద్యా శాఖ వనరులను ఏకీకృతం చేయడానికి, విద్యా సామర్థ్యాన్ని మెరుగుపరచడానికి దోహదపడుతుందని రాష్ట్ర విద్యాశాఖ వెల్లడించింది. తక్కువ హాజరు ఉన్న పాఠశాలను.. సమీపంలోని పెద్ద పాఠశాలల్లో విలీనం చేయనున్నారు. ఈ విషయమై యూపీ డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఎడ్యుకేషన్ కంచన్ వర్మ గత నెల అక్టోబరు 23న అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె.. తక్కువ హాజరు శాతం ఉన్న పాఠశాలల విలీనం కోసం ప్రణాళికలు సిద్ధం చేయాలని బ్లాక్ స్కూల్ అడ్మినిస్ట్రేటర్‌లను (BSAలు) ఆదేశించింది.
Also Read :- సీఎం యోగికి.. బెదిరింపు కాల్స్ చేసింది ఎవరంటే
ప్రస్తుతం ఉత్తర ప్రదేశ్‌లో 50 కంటే తక్కువ మంది విద్యార్థులు ఉన్న ప్రాథమిక పాఠశాలలు 27,764 ఉన్నాయి. వీటి విలీనానికి సంబంధించి నవంబర్ 14లోగా తుది నివేదికలను సమర్పించాలని రాష్ట్ర విద్యాశాఖ.. బీఎస్‌ఏలను ఆదేశించింది.