
మరో గంటలో పెళ్లి..పేషియల్ కోసం సెలూన్కు వెళ్లిన పెండ్లికొడుకును దారిలో కాపుకాచి పట్టుకొని చితకొట్టారు. పెండ్లికొడుకు అన్నను, ఇంకొంతమంది బంధువులపై దాడి చేశారు. అంతేకాదు..గొడవలో పిస్టల్ తో కాల్పులు జరిపి భయాందోళనకు గురి చేశారు. అనుకోకుండా వరుడిపై దాడితో కుటుంబ సభ్యులు, బంధువులు షాక్ తిన్నారు. మరో గంటలో పెళ్లి ఉండగా వరుడిని ఎందుకు కొట్టారు.. ఏంజరిగింది వివరాల్లోకి వెళితే..
बरेली-पार्लर से वापस जा रहे दूल्हे से मारपीट, रास्ते से बाइक हटाने को लेकर हुआ विवाद
— भारत समाचार | Bharat Samachar (@bstvlive) February 23, 2025
आरोपियों ने पुलिस पर भी किया पथराव, 3 नामजद और 12 अज्ञात पर केस दर्ज, आँवला के स्टेट बैंक चौराहे की की घटना #Bareilly @bareillypolice @Uppolice pic.twitter.com/qYrAXjSfNY
ఉత్తరప్రదేశ్ లోని బరేలీకి చెందిన ముకుల్ గుప్తాపై సినిమా ఫక్కీలో దాడి జరిగింది. ముకుల్ గుప్తా పెళ్లి మరో గంటలో తాళికట్టే ముహూర్తం.. ఈలోపు ఫేషియల్ చేయించుకుందామని సెలూన్ కు వెళ్లాడు తిరిగి వస్తుండగా అతని ప్రత్యర్థులు ముకుల్ పై దాడి చేశారు. పిడిగుద్దుల వర్షం కురిపించారు. తీవ్రంగా గాయపర్చారు. ముకుల్ అన్న, ఇతర బంధవులను కూడా దారుణంగా కొట్టారు. అంతటితో ఆగక పిస్టల్ లో గాల్లోకి కాల్పులు జరిపి చంపుతామని బెదిరించారు.
విషయం తెలుసుకొని సంఘటన స్థలానికి వచ్చిన పోలీసులపై కూడా రాళ్లు రువ్వి భయభ్రాంతులకు గురి చేశారు. ఈ వివాదానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
పోలీసుల కథనం ప్రకారం.. బరేలీలోని అయోన్లా స్టేట్ బ్యాంక్ జంక్షన్ వద్ద గొడవ జరిగింది. ముకుల్ మెన్స్ పార్లర్ కు వెళ్లి వస్తుండగా అతని ప్రత్యర్థులు దాడి చేశారు. ఓ బైక్ పార్కింగ్ విషయంలో ముకుల్ కు మరో వర్గానికి జరిగిన వివాదం ముదిరి దాడి దారి తీసింది. బాధితుడు ముకుల్ సోదరుడు పోలీసులకు సమాచారం ఇవ్వగా అక్కడికి వచ్చిన పోలీసులపైనా రాళ్ల దాడి చేశారు దుండగులు.
ఈఘటనపై సీరియస్ గా తీసుకున్న బరేలీ పోలీసులు మొత్తం 15 మంది నిందితులను అరెస్ట్ చేశారు.