అన్లైన్ గేమ్స్ ఆడిన పిల్లలు..పేరెంట్స్ ఖాతానుంచి రూ.5లక్షలు మాయం

అన్లైన్ గేమ్స్ ఆడిన పిల్లలు..పేరెంట్స్ ఖాతానుంచి రూ.5లక్షలు మాయం

మీరు పిల్లల చేతికి ఫోన్ ఇస్తున్నారా..వాళ్లు ఆన్ లైన్ లో గేమ్స్ ఆడుతున్నారా..అయితే జాగ్రత్తగా ఉండండి..ఎందుకంటే పిల్లలు చేసే తప్పిదాల వల్ల పేరెంట్స్ బ్యాంకు ఖాతాలు ఖాళీ అవుతాయి.. ఉత్తరప్రదేశ్ లోని ఖుషీ నగర్ లోని జరిగిన సంఘటన ఇందుకు ఉదాహరణ.. 

పిల్లలు ఆన్ లైన్  బెట్టింగ్ గేమ్స్ అడుతూ.. వారి పేరెంట్స్ బ్యాంకు ఖాతాల్లో బ్యాలెన్స్ మొత్తం డబ్బులు ఖర్చు చేశారు. ఒక్క రూపాయి కాదు రెండు రూపాయలు కాదు..ఏకంగా 5 లక్షల రూపాయ లు మాయమయ్యాయి.  

యూపికి చెందిన చంద్రశేఖర్ సింగ్ నగదు డ్రా చేసుకునేందుకు బ్యాంకు కు వెళ్లగా వారి అకౌంట్లనుంచి రూ. 5లక్షలు మాయమయినట్లు గుర్తించారు. చంద్రశేఖర్ సింగ్ ఖాతానుంచి 3.5లక్షలు, ఆయన భార్య ఖాతానుంచి 1.5లక్షలు రూపాయలు మాయమయ్యాయి. మొదట్లో పిల్లలు హ్యాకర్లే ఆ నగదును దొంగిలించి ఉంటారని చెప్పారు. అయితే చంద్రశేఖర్ సింగ్ ఇన్ కం ట్యాక్సు అధికారులను సంప్రదించగా అసలు విషయం బయటపడింది. 

చంద్రశేఖర్ సింగ్ కుమారులు ఆదిత్య సింగ్ (7వ తరగతి) , అన్ష్ సింగ్ (8వ తరగతి)లను ప్రశ్నించగా.. హ్యాకర్ డబ్బును దొంగిలించి ఉంటాడని చెప్పారు. చివరకు సింగ్ తన న్యాయవాది నుంచి వారి బ్యాంకు ఖాతాల వివరాలను తీసుకోవడంతో ఆదిత్యసింగ్, అన్ష్ సింగ్ లు ఆన్ లైన్ బెట్టింగ్ గేమ్స్ ఆడి డబ్బులు పోగొట్టినట్టు గుర్తించారు. 

పిల్లలుకు సెల్ ఫోన్లు ఇచ్చేటప్పుడు పేరెంట్స్ చాలా జాగ్రత్తగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు.