ఘోరం.. ఫ్రెండ్స్ డబ్బులిస్తానంటే.. రేప్ చేయడానికి ఒప్పుకున్నాడు.. భార్య ఫిర్యాదుతో వెలుగులోకి వచ్చిన ఘటన

ఉత్తరప్రదేశ్లో డబ్బుల కోసం భార్యను రేప్ చేయడానికి అంగీకరించాడు ఓ భర్త. రేప్ చేసింది మరెవరో కాదు.. అతని ఫ్రెండ్సే. వినడానికి దారుణంగా ఉన్న ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లోని బులంద్ శహర్ లో జరిగింది. మూడేళ్లుగా జరుగుతున్న ఈ ఘోరంపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో బయట పడింది ఈ  ఘటన. 

బులంద్ శహర్ కు చెందిన ఓ మహిళ (35) తనను ఇద్దరు మూడేళ్లుగా అత్యాచారం చేస్తు్న్నారని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. తన భర్త ఫ్రెండ్స్ తనను రేప్ చేశారని, తన భర్త అనుమతితో ఇదంతా జరిగిందని ఫిర్యాదులో పేర్కొంది మహిళ. 

మహిళ భర్త సౌదీ అరేబియాలో ఆటోమొబైల్ మెకానిక్ వర్క్ చేస్తున్నాడు. అయితే డబ్బుల కోసం తన ఫ్రెండ్స్ ను రేప్ చేయడానికి అనుమతించాడని మహిళ పేర్కొంది. అయితే ఫ్రెండ్స్ రేప్ చేస్తుంటే కూర్చొని వీడియోలో చూసి ఆనందించేవాడని మహిళ వాపోయింది. ఈ విషయం ఎవరికైనా చెబితే విడాకులు ఇస్తానని బెదిరించాడని తెలిపింది. 

ALSO READ | ఏంటీ ఘోరం : ఐటీ ఆఫీసు పార్కింగ్ లోనే.. మహిళా కొలీగ్ ను కొట్టి చంపిన మగ ఉద్యోగి

ఏడాదికోసారి తన భర్త ఇండియా వచ్చే వాడని, వచ్చిన తర్వాత కూడా అతని ఆలోచన మారలేదని తెలిపింది. తన పిల్లల భవిష్యత్తు కోసం ఇన్నాళ్లు ఈ ఘోరాన్ని భరిస్తూ వచ్చానని చెప్పింది. ఏదైతే అదైతుందని సాహసంతో పోలీస్ కంప్లైంట్ ఇచ్చానని మహిళ తెలిపింది. 

అయితే సదరు మహిళకు జరుగుతున్న అన్యాయం గురించి తమకు తెలియదని ఆమె కుటుంబ సభ్యులు తెలిపారు. కంప్లైంట్ ఇస్తానని తన సిస్టర్ చెప్పడంతో భార్య భర్తలకు గొడవ జరిగిందని, ధైర్యం చేసి పోలీస్ కంప్లైంట్ ఇచ్చిందని ఆమె సోదరుడు అన్నాడు.

మహిళ ఫిర్యాదు మేరకు కంప్లైంట్ రిజిస్టర్ చేశారు పోలీసులు. నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. త్వరలోనే అరెస్టు చేసి విచారణ జరుపుతామని పోలీసులు తెలిపారు.