మరదల్ని గ్యాంగ్ రేప్ చేయించేందుకు రూ.40 వేల లోన్ తీసుకున్నాడు.. చివరికి ఏమైందంటే..

మరదల్ని గ్యాంగ్ రేప్ చేయించేందుకు రూ.40 వేల లోన్ తీసుకున్నాడు.. చివరికి ఏమైందంటే..

మరదల్ని గ్యాంగ్ రేప్ చేయించేందుకు రూ.40 వేల లోన్ తీసుకున్నాడు ఓ వ్యక్తి. ఇద్దరు హంతకులకు ఆ డబ్బు ఇచ్చి గ్యాంగ్ రేప్ చేయించి చంపించాడు ఓ దుర్మార్గుడు. ఆ తర్వాత ఆనవాళ్లు కనింపచకుండా చేసేందుకు శవాన్ని తగలబెట్టాడు. ఈ దారుణ ఘటన ఉత్తర ప్రదేశ్ లోని ముజఫర్ నగర్ లో చోటు చేసుకుంది. 

పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం.. ముజఫర్ నగర్ లో 21 ఏళ్ల అమ్మాయి జనవరి 21 నుంచి కనిపించకుండా పోయింది. శుక్రవారం (జనవరి 31) అడవిలో ఆమెకు సంబంధించిన పుర్రె, సగం కాలిన బట్టలను దగ్గర్లో ఉన్న అడవిలో గుర్తించారు. ‘‘అమ్మాయిని పూర్తిగా గుర్తుపట్టలేనంతగా కాల్చేశారు.. అమ్మాయి సగం కాలిన బట్టలు, ఉంగరం, గొలుసులను చూసి తమ కూతురేనని ఆమె పేరెంట్స్ గుర్తించారు’’ అని పోలీస్ అధికారి తెలిపారు. 

ఈ అత్యాచారానికి పాల్పడిన వ్యక్తులతో పాటు, మీరట్ కు చెందిన ప్రధాన నిందితుడు (అమ్మాయి బావ) పై బీఎన్ఎస్ సెక్షన్ల కింద కేసు శనివారం (ఫిబ్రవరి 1) నమోదు చేసి అరెస్టు చేశారు పోలీసులు. అత్యాచారానికి పాల్పడిన ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నట్లు తెలిపారు. 

ముజఫర్ నగర్ ఎస్పీ ఆదిత్య భన్సల్ చెప్పిన వివరాల ప్రకారం ‘‘ అమ్మాయి జనవరి 21 నుంచి కనిపించడం లేదు. ఆమె కుటుంబ సభ్యులు బుధాన స్టేషన్లో చేసిన ఫిర్యాదు మేరకు దర్యాప్తు ప్రారంభించాం. అతని బావ స్కూటర్ పైన వెళ్లినట్లు సీసీ టీవీ ద్వారా గుర్తించాం. ప్రధాన నిందితుడిని హత్యకు గల కారణాలను విచారించగా.. గత రెండేళ్లుగా సంబంధంలో ఉన్నమని చెప్పాడు. అయితే తాము కలిసి ఉన్నప్పటి ప్రైవేట్ పోటోలు, వీడియోలను ఉపయోగించి బ్లాక్ మెయిల్ చేసిందని, అందరికీ తెలిసిపోతుందనే భయంతోనే ఈ నేరానికి పాల్పడినట్లు చెప్పాడు. అమ్మాయిని చంపేందుకు బ్యాంకు లోన్ రూ. 40 వేలు తీసుకున్నాడు, ఇద్దరికీ పది పది వేలు అడ్వాన్స్ గా ఇచ్చాడు, పని పూర్తయిన తర్వాత మిగతా 20 వేలు ఇస్తానని ఒప్పందం చేసుకున్నట్లు నిందితుడు చెప్పాడు’’ అని ఎస్సీ తెలిపారు. 

‘‘హంతకులు ముందుగా అమ్మాయిని అత్యాచారం చేశారు.. ఆ తర్వాత చున్నీతో గొంతుకు బిగించి చంపేశారు.. ఎవిడెన్స్ తెలియకుండా ఉండేదుకు బాడీని పూర్తిగా కాల్చేశారు. ఆమె ఆభరణాలు, సగం కాలిన దుస్తుల ఆధారంగా గుర్తించాం. ఘటనా స్థలంలో రెండు కండోమ్ లు కూడా దొరికాయి’’ అని ఎస్పీ చెప్పారు. 

ఈ దారుణమైన ఘటన ఉత్తరప్రదేశ్ లో సంచలనంగా మారింది. నిందితులను వెంటనే శిక్షించాలని కుటుంబ సభ్యులతో పాటు, ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.