జంతు హింసకు సంబంధించిన ఓ షాకింగ్ సంఘటనలో, ఒక వ్యక్తి కుక్క మెడకు తాడు కట్టి కిరాతకంగా చంపిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో కనిపించింది. ఈ వీడియో వీక్షకులను దిగ్భ్రాంతికి గురి చేసింది, జంతు ప్రేమికులను ప్రేరేపించింది. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్‌లోని ఔరయ్యా జిల్లాలో ఆగస్టు 31 సాయంత్రం జరిగింది. ఈ షాకింగ్ ఫుటేజ్ సమీపంలోని CCTV లో నిక్షిప్తమైంది.
ఈ వీడియోను ప్రియా సింగ్ అనే X యూజర్ పోస్ట్ చేసారు. "యుపిలోని ఔరయ్యాలో, ఒక వ్యక్తి కుక్క మెడకు తాడు కట్టి, నేలపై విసిరి చంపాడు. ఇది మానవత్వం నశించినట్టు కనిపిస్తోంది" అని ఆమె క్యాప్షన్ లో రాసుకువచ్చింది.
Also Read : మిస్టరీ ఏంటీ : భార్యను కాల్చి చంపిన రియల్ ఎస్టేట్ వ్యాపారి.. ఆ తర్వాత గుండెపోటుతో మృతి
ఈ వీడియోలో, వ్యక్తి రద్దీగా ఉండే వీధిలో ఓ వ్యక్తి కుక్కను పిలిచి, ఆ తరువాత దాని మెడకు తాడు కట్టాడు. అనంతరం జంతువు తన ప్రాణాలను కోల్పోయే వరకు రోడ్డుపైనే దారుణంగా కొట్టాడు. ఆ వ్యక్తి కుక్కను క్రూరంగా కొట్టడం కనిపించడంతో, ఒక గుంపు అతని చుట్టూ గుమిగూడింది, కానీ జోక్యం చేసుకునే బదులు, వారంతా ఈ భయంకరమైన నేరానికి ప్రేక్షకులుగా నిలిచారు.
यूपी के औरेया में एक शख्स ने कुत्ते को पास बुलाया, गले में रस्सी बांधी और जमीन पर पटककर मार डाला।
— Priya singh (@priyarajputlive) September 1, 2023
लगता है इंसान के अंदर से मानवता खत्म होती जा रही है pic.twitter.com/LBzE7S91PJ