ఉత్తరప్రదేశ్‌లోని హాపూర్ జిల్లాలో ఒక జంట బైక్‌పై వేగంగా వెళుతున్న ఘటనకు సంబంధించిన వీడియో కెమెరాకు చిక్కింది. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలోనూ హల్‌చల్ చేస్తోంది. ఇందులో హైవేపై ఓ జంట బైక్‌పై వెళుతుండగా.. మహిళ ముందు కూర్చొని, పురుషుడు బైక్ నడుపుతున్నట్టు కనిపించారు. మహిళ కౌగిలించుకుని ముందు నుండి గట్టిగా పట్టుకోవడం వీడియోలో చూడవచ్చు. ఆ మహిళ మోటార్‌సైకిల్‌లోని పెట్రోల్ ట్యాంక్‌పై రివర్స్ డైరెక్షన్‌లో కూర్చొని వ్యక్తిని కౌగిలించుకోవడం ఈ వీడియోలో కనిపిస్తుంది.
సింబావోలీ పోలీస్ స్టేషన్ పరిధిలోని 9వ జాతీయ రహదారిపై ఈ ఘటన చోటుచేసుకుంది. రైడర్, పిలియన్ హెల్మెట్ ధరించకపోవడంతో వారు ట్రాఫిక్ నిబంధనలను కూడా ఉల్లంఘించారు. ఎటువంటి భద్రతా ప్రమాణాలు పాటించకుండా జాతీయ రహదారిపై ప్రమాదకరమైన స్టంట్ చేయడం చర్చనీయాంశంగా మారింది. హెల్మెట్ లేకుండా వాహనం నడుపుతూ వారు అనేక ట్రాఫిక్ చట్టాలను ఉల్లంఘించారు. మహిళ కూడా ఆ వ్యక్తికి ఎదురుగా కూర్చుని అతన్ని తన చేతుల్లో గట్టిగా పట్టుకోవడం సంచలనం సృష్టించే ఘటనగా మారింది.
Also Read :- వెపన్స్ డిపాజిట్ చేయండి
ఇటువంటి విన్యాసాలు రైడర్‌లతో పాటు రోడ్డుపై వెళ్లే పాదాచారులకు, ఇతర వాహనాలకు ప్రాణాంతకంగా మారతాయి. మోటారు సైకిల్‌లోని పెట్రోల్ ట్యాంక్‌పై తన ముందు కూర్చున్న మహిళతో వెళుతున్న వ్యక్తి ప్రమాదానికి గురయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే మహిళ ముందు కూర్చున్నందున రైడర్ రోడ్డుపై దృష్టి పెట్టలేడు. మహిళతో పాటు బైక్ రైడర్‌ను దాటి వెళ్లిన కారులో ఉన్న వ్యక్తి ఈ వీడియోను చిత్రీకరించాడు.
#Hapur वाह क्या सीन है, वीडियो NH 9 की थाना सिंभावली की है। बाइक पर आगे बैठा स्पाइडर वीमेन लग रही है, बाकी ट्रैफिक नियमो का क्या? वो तो चलते रहेंगे। @hapurpolice @uptrafficpolice pic.twitter.com/HojqWW2RNE
— Lokesh Rai (@lokeshRlive) October 10, 2023