లక్నో: ఉత్తరప్రదేశ్ ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతోన్న మహా కుంభమేళాలో తొక్కి సలాట జరిగి 30 మంది భక్తులు మృతి చెందగా.. మరో 60 గాయపడ్డారు. పవిత్ర వేడుకలో జరిగిన ఈ విషాద ఘటనపై ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కుంభమేళా తొక్కిసలాట ఘటనపై న్యాయ విచారణ జరిపించాలని నిర్ణయించింది. ఈ మేరకు విచారణకు ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేస్తూ బుధవారం (జనవరి 29) ఉత్తర్వులు జారీ చేసింది. జస్టిస్ కృష్ణ కుమార్ నేతృత్వంలో ముగ్గురు సభ్యులతో కూడిన న్యాయ విచారణ కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించింది.
15 రోజుల్లో రిపోర్టు సమర్పించాలని కమిటీని ఆదేశించినట్లు యూపీ సీఎం యోగి ఆదిత్య నాథ్ స్పష్టం చేశారు. అలాగే.. తొక్కి సలాటలో మృతి చెందిన కుటుంబాలకు ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది. మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల చొప్పున నష్ట పరిహారం అనౌన్స్ చేసింది. గాయపడిన వారి ట్రీట్మెంట్ ఖర్చు ప్రభుత్వమే భరిస్తుందని పేర్కొంది.
ALSO READ | కుంభమేళా చరిత్రలో చేదు అనుభవాలు.. 1954 తొక్కిసలాటలో 800 మంది చనిపోయారు..!
ఉత్తరప్రదేశ్ ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతోన్న మహా కుంభమేళాలో తొక్కి సలాట జరిగిన విషయం తెలిసిందే. మౌని అమావాస్య కావడంతో భక్తులు తండోపతండాలుగా తరలిరావడంతో ఈ పెను విషాదం చోటు చేసుకుంది. తొక్కి సలాటలో పదుల సంఖ్యలో భక్తులు మృతి చెందగా.. మరి కొందరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ క్రమంలో కుంభమేళా తొక్కిసలాట ఘటనపై యూపీ సర్కార్ అధికారిక ప్రకటన చేసింది. కుంభమేళాలో జరిగిన తొక్కి సలాటలో ఇప్పటి వరకు మొత్తం 30 మంది మృతి చెందినట్లు తెలిపింది. మరో 90 మంది భక్తులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు వెల్లడించింది.
ALSO READ | త్రివేణి సంగమం వైపు స్నానాలకు వెళ్లకండి: సీఎం యోగి ఆదిత్యానాథ్
మహాకుంభ్ డీఐజీ వైభవ్ కృష్ణ మాట్లాడుతూ.. మౌని అమావాస్య సందర్భంగా బ్రహ్మ ముహూర్తానికి ముందు బుధవారం తెల్లవారుజామున 1 నుండి 2 గంటల మధ్య అఖారా మార్గ్‌లో పెద్ద సంఖ్యలో ప్రజలు గుమిగూడారు.. భక్తులు సంగంలో ఒక్కసారిగా స్నానాలు చేసేందుకు ఎగబడటంతో బారికేడ్లు విరిగిపోయి తొక్కిసలాట జరిగినట్లు ఆయన తెలిపారు.
ALSO READ | కుంభమేళా తొక్కిసలాటలో 30 మంది మృతి: యూపీ సర్కార్ అధికారిక ప్రకటన
ఈ తొక్కిసలాటలో 90 మంది భక్తులు గాయపడ్డారు. వెంటనే అప్రమత్తమైన సహయక బృందాలు వారిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. దురదృష్టవశాత్తూ 30 మంది భక్తులు చనిపోయారని తెలిపారు. మృతుల్లో 24 మందిని గుర్తించామని.. మిగిలిన వారి వివరాలు తెలియాల్సి ఉందన్నారు. ఘటన స్థలంలో ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉందని.. సహయక చర్యలు కొనసాగుతున్నట్లు పేర్కొన్నారు.