
వామ్మో.. వామ్మో.. పెళ్లంటే భయపడే స్థాయికి వచ్చేశారు మగాళ్లు.. భార్యలా పిశాచాలా అన్నట్లు తయారయ్యారు కొందరు మహిళలు. భర్తను చంపటానికి ఏ మాత్రం వెనకాడటం లేదు.. మొన్నటికి మొన్న మీరట్ ఇష్యూ వెలుగులోకి వచ్చిన వారం రోజులకే యూపీలో మరో షాకింగ్ ఘటన బయటకు వచ్చింది. పెళ్లయిన 2 వారాల్లోనే.. 2 లక్షల రూపాయల సుపారీ ఇచ్చి మరీ భర్తను చంపించిన భార్య బాగోతం వణుకు పుట్టిస్తుంది. ఈ కేసు విచారణ సమయంలో పోలీసులకు సైతం మైండ్ బ్లాంక్ అవ్వటం విశేషం. పూర్తి వివరాల్లోకి వెళితే..
ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ఔరయ్య జిల్లా కేంద్రం. రెండు వారాల క్రితం.. అంటే 2025 మార్చి మొదటి వారంలో ప్రగతి యాదవ్, దిలీప్ యాదవ్ పెళ్లి జరిగింది. చాలా గ్రాండ్ గా వివాహం. పెళ్లయ్యి అత్తగారింట్లో అడుగుపెట్టిన ఆ భార్య.. భర్తను చంపించటానికి ఆ రోజు నుంచే ప్లాన్ చేసింది. ఈ క్రమంలోనే నాలుగేళ్లుగా ప్రేమించుకుంటున్న తన ప్రియుడు అనురాగ్ యాదవ్ కు కబురు పెట్టింది. అతని చేతిలో 2 లక్షల రూపాయలు పెట్టింది. నా భర్త దిలీప్ ను చంపాలని చెప్పింది ఆ భార్య ప్రగతి.
ప్రియుడు అనురాగ్ ప్లాన్ అమలు చేశాడు. సుపారీ గ్యాంగ్ ను కంటాక్ట్ అయ్యాడు. ఆ 2 లక్షలను వాళ్లకు ఇచ్చాడు. డబ్బులు తీసుకున్న కిరాతకులు.. ప్రగతి భర్త దిలీప్ యాదవ్ ను మార్చి 19వ తేదీన కత్తులతో పొడిచి.. పొలాల్లో పడేశారు. కొనఊపిరితో ఉన్న దిలీప్ ను గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. భర్త దిలీప్ ను మొదట సైఫాయి ఆస్పత్రికి.. అక్కడి నుంచి మధ్యప్రదేశ్ లోని గ్వాలియర్ కు.. ఆ తర్వాత ఆగ్రాలోని ఆస్పత్రికి తరలించి చికిత్స చేయించారు. ఫలితం లేకపోవటంతో మార్చి 21వ తేదీన దిలీప్ చనిపోయాడు.
Also Read:-MMTS ట్రైన్లో యువతిపై లైంగిక దాడి కేసు .. నిందితుడిని గుర్తించిన పోలీసులు
ఈ కేసులో విచారణ చేపట్టిన పోలీసులకు షాకింగ్ విషయాలు తెలిశాయి. దిలీప్ ను చంపించింది.. రెండు వారాల క్రితం పెళ్లి చేసుకున్న భార్య ప్రగతిని నిర్థారణకు వచ్చారు. ఆమెను అదుపులోకి తీసుకుని విచారించగా ప్రియుడు అనురాగ్ వ్యవహారం వెలుగులోకి వచ్చింది.
నాలుగేళ్లుగా ప్రేమించిన అనురాగ్ తో కలిసి ఉండటానికే ఈ పని చేసినట్లు చెప్పింది. పెళ్లి ఇష్టం లేదని కుటుంబ సభ్యులకు చెప్పినా వినకుండా.. బలవంతంగా పెళ్లి చేశారని.. అందుకే భర్త దిలీప్ ను సుపారీ ఇచ్చిన చంపించినట్లు భార్య ప్రగతి వెల్లడించింది. దిలీప్ ను చంపిన ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నారని.. వాళ్లను త్వరలోనే పట్టుకుంటామని ఔరయ్యా జిల్లా ఎస్పీ అభిజిత్ వెల్లడించారు.
ఏదిఏమైనా భర్తను చంపి.. ముక్కలు చేసి సిమెంట్ డ్రమ్ములో పెట్టిన మీరట్ ఇష్యూ మర్చిపోక ముందే.. వారం రోజుల్లోనే మరో ఘోరమైన ఘటన వెలుగులోకి రావటం సంచలనంగా మారింది.