కాన్పూర్ దేహత్ జిల్లాలో ఐదేళ్ల బాలికపై ఏడేళ్ల బాలుడు లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని ఆరోపించిన ఘటన సంచలనం రేపింది. జిల్లాలోని అక్బర్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గ్రామంలో 2023, సెప్టెంబర్ 17న అర్థరాత్రి జరిగిన ఈ ఘటనపై పోలీసులు ఫిర్యాదు మేరకు ఐపీసీ సెక్షన్ 376, పోక్సో చట్టంలోని సెక్షన్ 5/6 కింద ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు.
పిల్లలిద్దరినీ జిల్లా ఆస్పత్రికి తరలించగా వైద్య నివేదికలో అత్యాచారం జరిగినట్లు నిర్ధారించారు. ఈ ఘటన జరిగినప్పుడు తన కూతురు ఆడుకోవడానికి బయటకు వెళ్లిందని ఐదేళ్ల బాలిక తల్లి తెలిపారు. పోలీసులు ఈ కేసులో జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారని అక్బర్‌పూర్ కొత్వాలి పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ సతీష్ సింగ్ తెలిపారు. “ఏడేళ్ల లోపు పిల్లవాడు నేరం చేస్తే, అది నేరం పరిధిలోకి రాదు. అయితే, న్యాయపరమైన అభిప్రాయం తీసుకున్న తర్వాతే ఈ కేసులో తదుపరి చర్యలు తీసుకోబడతాయి. సెప్టెంబర్ 19న ఎఫ్‌ఐఆర్ నమోదైంది’’ అని తెలిపారు.
ఈ కేసు ఇప్పుడు దేశ వ్యాప్తంగా సంచలనం అయ్యింది. ఏడేళ్ల పిల్లోడు ఏంటీ.. ఐదేళ్ల పాపను అత్యాచారం చేయటం ఏంటీ.. ఈ వయస్సులో ఈ పెద్దరికం వ్యవహారాలు ఏంటీ.. ఈ ఆలోచనలు ఏంటీ.. ఈ విపరీత ప్రవర్తనలు ఎలా వస్తున్నాయి అనేది ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఏడేళ్ల పిల్లోడు అంటే రెండు లేదా మూడో తరగతి చదువుతుంటాడు.. ఐదేళ్ల పాప అంటే ఒకటో తరగతి చదువుతంది.. ఇంత చిన్న వయస్సులో అత్యాచారం చేయాలనే ఆలోచన, కోరిక ఎలా పుట్టింది.. అంత సామర్థ్యం ఆ పిల్లోడికి ఎలా వచ్చింది అనేది తీవ్ర చర్చకు దారి తీస్తోంది.