ఉత్తర్ ప్రదేశ్ హజ్రత్‌గంజ్ ప్రాంతంలోని ఎమ్మెల్యే ఫ్లాట్‌లో తెల్లవారుజామున బీజేపీ ఎమ్మెల్యే మీడియా సెల్‌లోని ఉద్యోగి ఉరివేసుకుని కనిపించాడు. బీజేపీ ఎమ్మెల్యే యోగేష్ శుక్లాకు కేటాయించిన ఫ్లాట్ నంబర్ 804లో అతని మృతదేహం వేలాడుతూ కనిపించింది. ఆత్మహత్యకు ముందు మృతుడు శ్రేష్ట తివారీ తనకు తెలిసిన ఓ వ్యక్తికి ఫోన్ చేసి ఆత్మహత్య చేసుకోబోతున్నట్లు చెప్పాడని హజ్రత్‌గంజ్ ఇన్‌స్పెక్టర్ ప్రమోద్ కుమార్ పాండే తెలిపారు. దీంతో ఫోన్ లో మాట్లాడిన ఆ వ్యక్తి పోలీసు కంట్రోల్ రూమ్‌కు సమాచారం అందించాడు. ఆ తర్వాత పోలీసు బృందాన్ని ఫ్లాట్ నంబర్ 804కి పంపారు. వారు తలుపు లోపలి నుండి లాక్ చేయబడడం గమనించి, ఎలాగోలా లోపలికి ప్రవేశించి చూడగా శ్రేష్ఠ ఉరి వేసుకుని కనిపించాడు. అనంతరం అతడి మొబైల్ ఫోన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
Also Read : ఇంకేమనాలమ్మా : నన్ను ఆంటీ అంటావా.. సెక్యూరిటీ గార్డును చెప్పుతో కొట్టింది..
ఈ కేసులో శ్రేష్ట ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియరాలేదు. పోలీసులు విచారణ ప్రారంభించారు. బారాబంకి హైదర్‌గఢ్‌లో నివాసం ఉంటున్న 24 ఏళ్ల శ్రేష్ఠ తివారీ బీజేపీ ఎమ్మెల్యే మీడియా సెల్‌లో పనిచేసేవారు. సెప్టెంబర్ 24న రాత్రి ఫ్లాట్‌లో ఒంటరిగా ఉన్నాడు. ఘటనా స్థలంలో సూసైడ్ నోట్ లాంటి ఆధారాలేమీ లభించలేదని పోలీసులు తెలిపారు. అనంతరం ఈ ఘటనపై మృతుడి బంధువులకు సమాచారం అందించారు.