యూపీలో రోడ్ ట్యాక్స్ మాఫీ.. భారీగా తగ్గిన హైబ్రిడ్ కార్ల ధరలు..

యూపీలో రోడ్ ట్యాక్స్ మాఫీ.. భారీగా తగ్గిన హైబ్రిడ్  కార్ల ధరలు..

ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం రోడ్ ట్యాక్స్ మాఫీ చేయటంతో స్ట్రాంగ్ హైబ్రిడ్, ప్లగ్ ఇన్ హైబ్రిడ్ కార్ల ధరలు భారీగా తగ్గాయి. ఎకో ఫ్రెండ్లీ వేరియెంట్స్ ని ప్రోత్సహించే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో మారుతీ సుజుకీకి సంబంధించిన గ్రాండ్ విటారా, ఇన్విక్టో కార్ల ధరలు సుమారు రూ.2లక్షల మేర తగ్గాయి.రోడ్ ట్యాక్స్ మాఫీ ప్రభావం మారుతీ సుజుకీతో పాటు టయోటాకి చెందిన ఇన్నోవా హైక్రాస్, అర్బన్ క్రూయిజర్ హైరైడర్ వంటి హైబ్రిడ్ కార్ల ధరలపై కూడా పడనుంది.

అయితే, ఎంత శాతం మేర రోడ్ ట్యాక్స్ ,మాఫీ చేస్తారన్న అంశంపై ప్రభుత్వం నుండి క్లారిటీ లేనప్పటికీ, 100శాతం రాయితీ ఉండనుందని సమాచారం అందుతోంది. ఈ నిర్ణయంతో రిజిస్ట్రేషన్ ధరలో సడలింపు అక్టోబర్ 2025 వరకు వర్తించనుంది. అలాగే, దేశవ్యాప్తంగా హైబ్రిడ్ వాహనాలకు డిమాండ్ చాలా ఎక్కువగా లేకపోవటంతో యుపిలో హైబ్రిడ్ వెహికల్స్, పిహెచ్‌ఇవిల రిజిస్ట్రేషన్‌కు సబ్సిడీ ఇవ్వడానికి ప్రభుత్వం పెద్ద బడ్జెట్‌ను కేటాయించాల్సిన అవసరం ఉండదని తెలుస్తోంది.