- పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణా రావు
హైదరాబాద్, వెలుగు: కాంగ్రెస్ హయాంలో గింజ కూడా కోత లేకుండా ధాన్యం కొనుగోలు చేస్తున్నామని పెద్దపల్లి కాంగ్రెస్ ఎమ్మెల్యే విజయరమణా రావు అన్నారు. బీఆర్ఎస్ హయాంలో క్వింటాల్‌కు 5 కిలోల నుంచి 15 కిలోల వరకు తరుగు పెట్టారని విమర్శించారు. అసెంబ్లీలో ఆయన మాట్లాడారు. పంటల బీమా పథకాన్ని కూడా బీఆర్ఎస్ సర్కార్ ఇవ్వలేదని అన్నారు. అకాల వర్షాలతో నష్టపోయిన పంటలకు పరిహారం ఇవ్వకుండా రైతులను మోసం చేసిందని మండిపడ్డారు.
నాడు వైఎస్‌రాజశేఖర్ రెడ్డి హయాంలోనే పంట పరిహారాలు అందాయని వివరించారు. గత బీఆర్ఎస్ సర్కార్ రైతు రుణమాఫీ కూడా సరిగ్గా చేయలేదన్నారు. ఎన్నికల ముందు హడావుడిగా చేసిన రుణమాఫీ కనీసం వడ్డీలకు కూడా సరిపోలేదని ఆరోపించారు. కానీ, కాంగ్రెస్ సర్కారు ఏకకాలంలో రూ.2 లక్షల రుణమాఫీ చేస్తున్నదని తెలిపారు.