![యూపీ వారియర్స్ కెప్టెన్‌గా దీప్తి శర్మ](https://static.v6velugu.com/uploads/2025/02/up-warriorz-name-deepti-sharma-as-captain-after-injury-to-star-player_OfZBtXwsTM.jpg)
న్యూఢిల్లీ: ఇండియా స్టార్ ఆల్‌రౌండర్ దీప్తి శర్మ విమెన్స్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) టీమ్ యూపీ వారియర్స్ కెప్టెన్‌గా ఎంపికైంది. పాదం గాయం కారణంగా రెగ్యులర్ కెప్టెన్ అలీసా హేలీ ఈ నెల 14 నుంచి జరిగే తాజా ఎడిషన్‌కు దూ రమైంది.
ఆమె స్థానంలో దీప్తి జట్టు సారథ్య బాధ్యతలు అందుకుంటుందని ఫ్రాంచైజీ ఆదివారం ప్రకటించింది. డొమెస్టిక్ క్రికెట్‌లో బెంగాల్, ఈస్ట్ జోన్ జట్లకు కెప్టెన్సీ చేపట్టిన అనుభవం ఉన్న దీప్తి.. డబ్ల్యూపీఎల్‌కు ముందు విమెన్స్ టీ20 చాలెంజ్‌లో వెలాసిటీ జట్టును నడిపించింది.