పెళ్లి చేసుకుని ఎంచక్కా హనీమూన్కు వెళ్లారు.. ఆ విషయం తెలిసి విడాకులిచ్చేసింది..!

పెళ్లి చేసుకుని ఎంచక్కా హనీమూన్కు వెళ్లారు.. ఆ విషయం తెలిసి విడాకులిచ్చేసింది..!

ఈ రోజుల్లో పెళ్లిళ్లు చిన్న చిన్న కారణాలతో పెటాకులవ్వటం కామన్ అయిపోయింది. పెళ్లి కొడుకు డ్యా్న్స్ చేశాడని, పెళ్లి కూతురు హగ్ చేసుకుందని, వంటలే బాలేవని.. ఇలా విచిత్రమైన కారణాలతో పళ్లిళ్లు ఆగిపోయిన ఇన్సిడెంట్స్ చాలానే చూస్తున్నాం. అయితే తాజాగా మరో పెళ్లి పెటాకులైన ఘటన ఉత్తరప్రదేశ్ లో చోటు చేసుకుంది. 

యూపీలోని దాద్రి కి చెందిన అమ్మాయి, నోయిడాకు చెందిన అబ్బాయితో పెళ్లి కుదిరింది. ఇద్దరూ ఒకరినొకరు నచ్చుకున్నారు. కట్న కానుకలు అన్నీ ముట్టాయి. సంతోషంగా గ్రాండ్ గా పెళ్లి చేశారు. డబ్బుకు ఏం కొదవ లేదు కాబట్టి.. హనీమూన్ విదేశాల్లో జరుపుకోవాలని అనుకున్నారు. అందుకోసం పేరెంట్స్ సలహాతో మారిషస్ కు టికెట్లు బుక్ చేసుకున్నారు. మారిషస్ వెళ్లిన తర్వాత ఆ ఆనందమంతా ఒక్క క్షణంలోనే బ్రేక్ అయిపోయింది.

మారిషస్ కు వెళ్లిన తర్వాత భర్త ఆ విషయంలో వీక్ అని తెలిసి అమ్మాయి వెంటనే ఇండియాకు తిరిగి వచ్చేసింది. భర్తకు ఆ ప్రాబ్లమ్ ఉందని తెలిసి మెడికల్ టెస్టులు చేయించుకొమ్మని డిమాండ్ చేసింది. అయితే ఆ తర్వాతే ఆ అమ్మాయికి టార్చర్ మొదలైందని పోలీసులు తెలిపారు. మెడికల్ టెస్టులు చేయించుకోకపోగా.. ఈ విషయం బయట చెబితే ప్రాణాలు దక్కవని బెదిరించారట అత్తామామలు. అంతే కాకుండా అదనపు కట్నం తీసుకురావాలని బెదిరించారని ఉమెన్ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చింది ఆ కొత్త పెళ్లి కూతురు. 

పెళ్లికి అడిగినంత కట్నం ఇచ్చామని, అయినా అదనపు కట్నం కోసం హరాస్ చేస్తున్నారని, చేయిచేసుకున్నారని పోలీస్ కంప్లైంట్ లో పేర్కొంది. మారిషస్ నుంచి తిరిగొచ్చాక మెడికల్ టెస్టులు చేయించుకోకుండా.. తన భర్త ఫుల్లుగా తాగుతూ గడుపుతున్నాడని, అదే సమయంలో అత్తమామలు కట్నం కోసం వేధిస్తున్నారని ఫిర్యాదు చేసింది. భర్త పరిస్థితి అర్థం చేసుకుని బయటకు చెప్పకుండా అడ్జస్ట్ కావాలని బెదిరించారని, పోలీస్ కంప్లైంట్ ఇస్తే చంపేస్తామని బెదిరించినట్లు కంప్లైంట్ చేసిందని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకుని విచారణ జరుపుతున్నారు.