
భూవివాదంలో ఇద్దరు వ్యక్తులు ఓ మహిళను దారుణంగా చంపేశారు. బలవంతంగా మద్యం తాగించి గొంతునులిమి నదిలో పడేశారు. ఈ షాకింగ్ ఘటన యూపీలోని ఎటావాలో జరిగింది. వివరాల్లోకి వెళితే..
ఉత్తరప్రదేశ్ లోని ఎటావాకు చెందిన 29యేళ్ల అంజలి అనే మహిళ భర్త చనిపోవడంతో తల్లిదండ్రులతో కలిసి జీవిస్తోంది. ఆమెకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఓ భూమికి సంబంధించి స్థానికంగా ఉండే శివేంద్రయాదవ్ అనే వ్యక్తి అంజలికి 6లక్షలు ఇవ్వాల్సి ఉండగా..ఇవ్వకుండా మొండికేసి దాటవేస్తున్నాడు.ఈ క్రమంలో అంజలి డబ్బుల కోసం శివేంద్ర యాదవ్ ను నిలదీసింది. దీంతో ఆమె కక్ష పెంచుకున్న శివేంద్ర యాదవ్ .. గౌరవ్ అనే మరో వ్యక్తితోకలిసి హత్య చేయాలని ప్లాన్ వేశాడు.
అంజలికి డబ్బులు ఇస్తానని పిలిచి హత్య చేశాడు. బలవంతంగా అంజలికి మద్యం తాగించి తర్వాత శివేంద్రయాదవ్, గౌరవ్ ఇదరు కలిసి గొంతు కోసి యమునా నదిలో పడేశారు. ఆమె స్కూటీని పెట్రోల్ పోసి తగలబెట్టారు.
►ALSO READ | ఉక్రెయిన్, రష్యా యుద్దం..సుమీ నగరంపై మిస్సైల్ దాడి..21మంది మృతి
ఐదురోజులుగా అంజలి ఇంటికిరాకపోవడంతో ఆమె తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.విచారణ చేపట్టిన పోలీసులు.. అంజలి మృతదేహాన్ని కుళ్లిన స్థితిలో యమునానదిలో గుర్తించారు. అంజలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. నిందితులిద్దరిని అరెస్ట్ చేశారు. అంజలిని తామే హత్య చేసినట్లు నిందితులు ఒప్పుకున్నారు.