OMG: దుబాయ్లో భారతీయ మహిళను ఉరి తీశారు

OMG: దుబాయ్లో భారతీయ మహిళను ఉరి తీశారు

పాపం బతుకు దెరువు కోసం ఇండియానుంచి దుబాయ్ వెళ్లింది ఓ మహిళ. ఏదో విధంగా ఉద్యోగం సంపాదించింది..అయితే ఆ ఉద్యోగమే ఆమె ప్రాణాల మీదకు తెస్తుందని అనుకోలేదు. యూఏఈ రూల్స్ ఆమె జీవితాన్ని అర్థాంతరంగా ముగించేలా చేశాయి.ఓకేసులో ఢిల్లీకి చెందిన షహజాది ఖాన్ అనే మహిళకు ఉరిశిక్ష విధించింది యూఏఈ ప్రభుత్వం.  కడసారి చూపుకోసం దుబాయ్ పంపించాలని ఆమె తల్లిదండ్రులు భారత ప్రభుత్వాన్ని విజ్ణప్తి చేయగా అందుకు విదేశాంగ శాఖ అనుమతినిచ్చింది. మార్చి5న దుబాయ్ లో ఆమె అంత్యక్రియలకు హాజరుకానున్నారు ఆమె కుటుంబ సభ్యులు. పూర్తి వివరాల్లోకి వెళితే.. 

యూపీకి చెందిన షాహజాది ఖాన్ 33యేళ్ల మహిళ.. 2022డిసెంబర్ 19లోటూరిస్ట్ వీసాపై అబుదాబి వెళ్లింది. అక్కడ కేర్ టేకర్ గా ఉద్యోగం సంపాదించింది. ఆ ఉద్యోగమే ఆమె ప్రాణాలు మీదకు తెచ్చింది.. షాహజాది కేర్ టేకర్ గా ఉన్న బాబు అనుమానాస్పద స్థితిలో చనిపోయాడు. చిన్నారి చావుకు కారణం కేర్ టేకర్ అని పేరెంట్స్ ఫిర్యాదు చేయడంతో ఆమెను అక్కడి పోలీసులు అరెస్ట్ చేశారు.  
వాదోపవాదాల అనంతరం షహజాది ఖాన్ కు 2023 జూలై 31న అక్కడి కోర్టు ఉరిశిక్ష విధించింది. 2024ఫిబ్రవరి 28న అబుదాబీ అప్పీలేట్ కూడా ఉరిశిక్షను సమర్ధించింది. ఉరిశిక్షకు ముందు ఆమెను అల్ వత్బా సెంట్రల్ జైలులో ఉంచారు.
అయితే షహజాది ఖాన్ దీనస్థితిపై ఆమె తండ్రి షబ్బీర్ ఖాన్ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ వేశారు. దీంతో భారత విదేశాంగ శాఖ అబుదాబీ అధికారులను సంప్రదించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. దీంతో షహజాది ఖాన్ ను ఉరితీశారు. 
మార్చి 5న చివరి కర్మలు
అబుదాబికి వెళ్లడానికి కేంద్రం ఆమె తల్లిదండ్రులకు అండగా ఉంది. ప్రయాణ ఏర్పాట్లలో భారత రాయబార కార్యాలయం కుటుంబానికి సాయం చేస్తోంది. మార్చి 5న ఆమె అంత్యక్రియల నిర్వహించనున్నారు.