‘మీరట్ మర్డర్ గుర్తుందా.. మాకు అడ్డొస్తే నీకూ అదే గతి’.. భార్య వార్నింగ్ వీడియో వైరల్..!

‘మీరట్ మర్డర్ గుర్తుందా.. మాకు అడ్డొస్తే నీకూ అదే గతి’.. భార్య వార్నింగ్ వీడియో వైరల్..!

మీరట్ మర్డర్ గుర్తింది కదా. మర్చంట్ నేవీ ఆఫీసర్ ను 15 ముక్కలుగా నరికి.. డ్రమ్ లో వేసి సిమెంట్ నీళ్లు పోసిన ఘటన. నేవీ ఆఫీసర్ భార్య తన ప్రియుడితో కలిసి భర్తను చంపిన తీరుకు దేశం అంతా నిర్ఘాంతపోయింది. ఈ ఘటనను గుర్తు చేస్తూ ఓ మహిళ తన భర్తకు వార్తింగ్ ఇచ్చి.. కొడుతున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

ఉత్తరప్రదేశ్ లోని గోండా లో జరిగింది ఈ ఘటన. బాడీని ముక్కలుగా నిరికి డ్రమ్ లో వేసి సిమెంట్ పోస్తానంటూ భర్తను బెదిరించింది అతని భార్య. తన వివాహేతర బంధానికి అడ్డొస్తే తనకూ అదే గతి పడుతుందని హెచ్చరించింది. అంతేకాకుండా తన అత్తగారిని (భర్త వాళ్ల అమ్మ) కూడా చంపేస్తానని బెదిరించింది. 

ఈ విషయంలో ఇద్దరి తరఫునుంచి ఫిర్యాదు రావడంతో కేసు నమోదు చేశారు పోలీసులు. భార్య భార్తలు ఇద్దరు గొడవపడుతున్న వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. భర్తను కొడుతున్న విజువల్స్ వీడియోలో కనిపించడం చర్చనీయాంశంగా మారాయి. విచారణ తర్వాత తప్పు ఎవరిదో విచారించి చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. 

Also Read:-ఫ్రస్టేషన్.. కోపం.. ఆవేశం.. ప్రాణాలు తీసిన మూడు ఘటనలు.. 24 గంటల వ్యవధిలో ఐదు హత్యలు!

పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం.. ఝాన్సీకి చెందిన ధర్మేంద్ర కుశ్వాహ గోండ లోని జిల్ నిగమ్ లో ఉద్యోగం చేస్తున్నాడు. తన భార్య మాయా మౌర్య, ఆమె ప్రియుడు నీరజ్ మౌర్య కలిసి తనను చంపేస్తామని బెదిరిస్తున్నట్లు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కుశ్వాహ 2016 లో బస్తీ జిల్లాకు చెందిన మాయా మౌర్యతో లవ్ మ్యారేజ్ చేసుకున్నానని, ఇప్పుడు మరో వ్యక్తితో సంబంధం పెట్టుకుని తనను బెదిరిస్తోందని చెప్పాడు. 

గొడవ వెనక గల కారణం:

కుశ్వాహ తీసుకున్న మూడు కార్లను భార్య మాయా మౌర్య పేరున రిజిస్ట్రేషన్ చేసినట్లు చెబుతున్నాడు. అదే విధంగా 2020 లో స్థలం తీసుకుని అదికూడా ఆమె పేరునే రిజిస్ట్రేషన్ చేశాడట. అక్కడ బిల్డింగ్ నిర్మించేందుకు ఆమె బంధువు నీరజ్ మౌర్యకు కాంట్రాక్ట్ కోసం ఇచ్చాడట. బిల్డింగ్ నిర్మాణం సమయంలో ఇద్దరు దగ్గరయ్యారని, కరోనా టైమ్ లో నీరజ్ భార్య చనిపోవడంతో వీళ్ల బంధం మరింత బలపడిందని తెలిపాడు. 

2024 జులై 7న ఇద్దరినీ చూడకూడని పరిస్థితులలో చూశానని, ప్రశ్నించినందుకు అప్పుడే తనను కొట్టినట్లు చెప్పాడు. ఆ తర్వాత తన భార్య ఇళ్లు వదిలి వెళ్లినట్లు తెలిపాడు కుశ్వాహ. ఆ తర్వాత ఆగస్టు 25న ప్రియుడు నీరజ్ తో కలిసి వచ్చిన మాయ.. ఇంటి తాళం పగలగొట్టి డబ్బుతో పాటు 15 గ్రాముల బంగారం ఎత్తుకెళ్లినట్లు ఫిర్యాదులో పేర్కొన్నాడు. దీనిపై 2024 సెప్టెంబర్ 1న ఫిర్యాదు చేశాడు కుశ్వాహ.

మార్చి 29న మళ్లీ వచ్చిన మాయా, ప్రియుడితో కలిసి తనను, తన తల్లిని దాడి చేసినట్లు పేర్కొన్నాడు. తన తల్లిని చంపేస్తానని బెదిరించినట్లు తెలిపాడు. అడ్డుకోవడంతో.. ‘‘ఎక్కువ మాట్లాడితే మీరట్ మర్డర్ లాగే నువ్వు కూడా మర్డర్ అయిపోతావ్.. ముక్కలు ముక్కలుగా నరికి డ్రమ్ లో వేసి సిమెంట్ పోస్తా’’ అని బెదిరించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నాడు కుశ్వాహ. 

అయితే తన భర్త తప్పుడు ఆరోపణలు చేస్తున్నాడని కుశ్వాహ భార్య మాయ తెలిపింది. కుశ్వాహ తనను టార్చర్ పెడుతున్నాడని, ఇప్పటికే 4 సార్లు అబార్షన్ చేయించాడని ఆమె ఇచ్చిన ఫిర్యాదులో తెలిపింది. 2024 జులైలో మహిళా పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినందుకు కొట్టాడని, ఆ తర్వాత విడాకులు అడిగీ.. ఇంట్లో నుంచి వెళ్లగొట్టాడని ఆమె తన కంప్లైంట్ లో పేర్కొంది. 

ఇద్దరి ఫిర్యాదులు స్వీకరించిన పోలీసులు.. విచారణ తర్వాత చర్యలు తీసుకుంటామని తెలిపారు.