ప్రొ కబడ్డీ లీగ్‌‌‌‌‌‌‌‌ 11వ సీజన్‌‌‌‌‌‌‌‌ సెమీ ఫైనల్లో యూపీ, పట్నా పైరేట్స్‌‌‌‌

ప్రొ కబడ్డీ లీగ్‌‌‌‌‌‌‌‌ 11వ సీజన్‌‌‌‌‌‌‌‌ సెమీ ఫైనల్లో యూపీ, పట్నా పైరేట్స్‌‌‌‌

పుణె : ప్రొ కబడ్డీ లీగ్‌‌‌‌‌‌‌‌ 11వ సీజన్‌‌‌‌‌‌‌‌లో  యూపీ యోధాస్, పట్నా పైరేట్స్‌‌‌‌‌‌‌‌ సెమీఫైనల్ చేరుకున్నాయి. గురువారం జరిగిన తొలి ఎలిమినేటర్ మ్యాచ్‌‌‌‌‌‌‌‌లో యూపీ యోధాస్ 46–18తో జైపూర్ పింక్‌‌‌‌‌‌‌‌ పాంథర్స్‌‌‌‌‌‌‌‌ను చిత్తు చేసింది. భవానీ రాజ్‌‌‌‌‌‌‌‌పుత్‌‌‌‌‌‌‌‌ 12 పాయింట్లతో యూపీని గెలిపించాడు.

మరో ఎలిమినేటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో పట్నా పైరేట్స్‌‌‌‌‌‌‌‌ 31–23తో యు ముంబాపై గెలిచింది. పట్నా రైడర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అయాన్‌‌‌‌‌‌‌‌ 10, దేవాంక్ 8 పాయింట్లతో రాణించారు. శుక్రవారం జరిగే సెమీఫైనల్స్‌‌‌‌‌‌‌‌లో హర్యానా స్టీలర్స్‌‌‌‌‌‌‌‌తో యూపీ యోధాస్‌‌‌‌‌‌‌‌, దబాంగ్ ఢిల్లీతో పట్నా తలపడతాయి.