గొంతు, చేతులు కోసుకుని.. యూపీ యువకుడు హల్​చల్

కాజీపేట, వెలుగు: హనుమకొండ జిల్లా కాజీపేట మండల కేంద్రంలో బుధవారం మధ్యాహ్నం ఓ యువకుడు సైకోలా ప్రవర్తిస్తూ హల్ చల్​చేశాడు. నడిరోడ్డుపై కత్తితో గొంతు, చేతులు కోసుకుని నానా హంగాహ సృష్టించాడు. చేతులు, గొంతు నుంచి రక్తం కారుతుండగా చౌరస్తా మీదుగా పోలీస్ స్టేషన్ వైపు వెళ్లాడు. స్థానికులు అతన్ని చూసి పరుగులు తీశారు. 

నేరుగా పోలీస్​స్టేషన్​కు వెళ్లిన సదరు యువకుడిని, పోలీసులు వారించి 108లో వరంగల్​ఎంజీఎంకు తరలించారు. ప్రస్తుతం అక్కడ చికిత్స పొందుతున్నాడు. పోలీసులు అతని వివరాలు తెలుసుకునేందుకు ప్రయత్నించగా.. తన పేరు జితేందర్ అని, యూపీలోని ఆగ్రా ప్రాంతానికి చెందిన వాడినని చెప్పాడు. కత్తితో కోసుకోవడానికి గల కారణాలను మాత్రం చెప్పలేదు. గంజాయి మత్తులో ఇలా చేసినట్లు తెలుస్తోంది.