యూపీఏ హామీలిస్తే మేం చేసి చూపించాం: నిర్మలాసీతారామన్

యూపీఏ హయాంలో హామీలిస్తే తాము చేసి చూపించామన్నారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. అవిశ్వాసం తీర్మానం సందర్భంగా మాట్లాడిన  ఆమె.. యూపీఏ హయాంలో గ్యాస్ ,బ్యాంకు అకౌంట్లు రాలేదని ఎన్డీయే హయాంలో వచ్చాయన్నారు. యూపీఏ హయాంలో బ్రిడ్జీలు కట్టలేదని..ఎన్డీఏ హయాంలో కట్టామని చెప్పారు.  యూపీఏ హయాంలో కరెంట్ రాలేదు.. ఎన్డీయే హయాంలో వచ్చిందన్నారు. యూపీఏహయాంలో రానివన్నీ ఎన్డీయే హయంలో వచ్చాయన్నారు. డిజిటల్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ లో ఎంతో  ప్రగతి సాధించి చూపించామన్నారు. 

భారత్ లో ఆర్థిక వ్యవస్థ వేగంగా వృద్ధి చెందుతోందన్నారు నిర్మలా సీతారామన్.  కొవిడ్ సమయంలో ఆర్థిక వ్యవస్థ మెరుగుపడిందని తెలిపారు.   పలు దేశాల్లో ఆర్థిక వ్యవస్థ దిగజారిపోయిందని వెల్లడించారు. చైనా వంటి దేశాల్లో ఆర్థిక వ్యవస్థ పతనమైందన్నారు. నేడు మనం ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా ఉన్నామని తెలిపారు.

ALSO READ :శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కొత్త రూల్: స్టూడెంట్ తోపాటు ముగ్గురికే అనుమతి

స్కాంలతో  UPA   దశాబ్దాన్ని వృధా చేసిందని ఆరోపించారు.  ప్రజలు 2014 , 2019 లో UPAకి వ్యతిరేకంగా అవిశ్వాసం పెట్టి ఓడించారని తెలిపారు. 2024 లో కూడా అదే పరిస్థితి ఉంటుందన్నారు. UPA పేరు మార్చవలసిన అవసరం ఏమి వచ్చింద్నారు. బ్యాంకింగ్ రంగంలో ఎన్నో మార్పులు చేశామని... బ్యాంకులు రాజకీయ జోక్యం లేకుండా పని చేస్తున్నాయన్నారు.  

సామాన్యుల కోసం జన్ ధన్ యోజన, డిజిటల్ ఇండియా, ఆయుష్మాన్ భారత్ వంటి ఎన్నో పథకాలు మోడీ తీసుకొచ్చారని చెప్పారు. ఇండియా కూటమిలోని పాలర్టీ మధ్య  ఐక్యత ఎక్కడుందని ప్రశ్నించారు నిర్మలాసీతారామన్.  రాష్ట్రాల్లో ఒకదానితో ఒకటి పోటీపడుతూ కూటమి పేరుతో మోసం చేస్తున్నాయన్నారు.