విద్యార్థులను ఉన్నతంగా తీర్చిదిద్దాలి : రఘోత్తం​రెడ్డి

కామారెడ్డి, వెలుగు: విద్యార్థులను ఉన్నతంగా తీర్చిదిద్దేందుకు హెడ్​మాస్టర్లు ప్రత్యేక చొరవ చూపాలని  ఉపాధ్యాయ ఎమ్మెల్సీ కూర రఘోత్తం​రెడ్డి పేర్కొన్నారు. కామారెడ్డి జిల్లాతో పాటు, వివిధ జిల్లాల నుంచి ప్రమోషన్లపై ఇక్కడికి వచ్చిన గెజిటెడ్​ హెడ్​మాస్టర్లను మంగళవారం జిల్లా కేంద్రంలో సన్మానించారు.  ప్రోగ్రామ్​కు చీఫ్​ గెస్ట్​గా హాజరైన రఘోత్తం​రెడ్డి మాట్లాడుతూ.. గవర్నమెంట్​స్కూల్స్​కు వచ్చే పిల్లలకు  మెరుగైన విద్య అందించడం ద్వారా స్కూళ్లను బలోపేతం చేయాలన్నారు. 

ALSO  READ :- పై ఆఫీసర్లకు నై.. ప్రజాప్రతినిధులకు జై .. వివాదాస్పదంగా ఖాకీల వైఖరి

మౌలిక వసతుల కల్పన విషయాన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తానన్నారు. పీఆర్టీయూ జిల్లా ప్రెసిడెంట్, జనరల్​సెక్రెటరీ పుల్గం దామోదర్​రెడ్డి, అల్లాపూర్​కుషాల్, స్టేట్​కార్యవర్గ సభ్యులు మధుసూదన్​రెడ్డి, పోచయ్య, మాణిక్యం, నారాయణ్​రెడ్డి, సంగారెడ్డి, జిల్లా ప్రతినిధులు జి.గోవర్ధన్, ఆనంద్​రావు, సుధాకర్​తదితరులు పాల్గొన్నారు.