శ్రీదేవి కూతురికి స్పెషల్ గిఫ్ట్ ఇచ్చిన మెగా కోడలు ఉపాసన..

శ్రీదేవి కూతురికి స్పెషల్ గిఫ్ట్ ఇచ్చిన మెగా కోడలు ఉపాసన..

బాలీవుడ్ బ్యూటిఫుల్ హీరోయిన్ జాన్వీ కపూర్ తెలుగులో వరుస ఆఫర్లు దక్కించుకంటూ దూసుకుపోతోంది. గత ఏడాది జాన్వీ హీరోయిన్ గా నటించిన దేవర సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. ప్రస్తుతం జాన్వీ కపూర్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న "RC16 (వర్కింగ్ టైటిల్)" లో హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాని ఉప్పెన మూవీ ఫేమ్ బుచ్చిబాబు సాన స్పోర్ట్స్ డ్రామా బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిస్తున్నాడు.

అయితే ఇటీవలే ఈ సినిమా రెండో షెడ్యూల్ హైదరాబాద్ లో జరిగింది. దీంతో ఈ షూటింగ్ లో హీరోయిన్ జాన్వీ కపూర్ కూడా పాల్గొంది. షూటింగ్ పూర్తవడంతో జాన్వీ జూబిలీ హిల్స్ లో ఉన్న చిరంజీవి ఇంటికి వెళ్ళింది. దీంతో క్లిన్ కారా, ఇతర కుటుంబ సభ్యులతో కలసి సరదాగా టైమ్ స్పెండ్ చేసింది. ఐతే ఉపాసన తన అత్త కొణిదెల సురేఖ కి అత్తమ్మాస్ కిచెన్ కి  సంబందించిన పికిల్స్, కుకింగ్ రెసిపీస్ హంపర్స్ ని గిఫ్ట్ గా ఇచ్చింది. దీంతో ఈ ఫోటోలు ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఈ విషయం ఇలా ఉండగా ఈమధ్య నటి జాన్వీ కపూర్ ఎక్కువగా సౌత్ సినిమా ఇండస్ట్రీపై దృష్టి సారించింది. దీంతో కోలీవుడ్, టాలీవుడ్ నుంచి ఎలాంటి ఆఫర్ వచ్చిన వెంటనే ఒకే చెబుతోంది. ప్రస్తుతం జాన్వీ కపూర్ పరం సుందరి అనే హిందీ సినిమాలో కూడా నటిస్తోంది. ఈ సినిమాని లేడీ ఓరియెంటెడ్ బ్యాక్ డ్రాప్ లో తుషార్ జలోటా తెరకెక్కిస్తుండగా బాలీవుడ్ స్టార్ హీరో అభిషేక్ బచ్చన్, ఛావా మూవీ ఫేమ్ అక్షయే ఖన్నా తదితరులు నటిస్తున్నారు.

ALSO READ | Sobhita and Samantha: శోభిత దుస్తులపై ట్రోలింగ్.. సమంతని కాపీ కొట్టిందంటూ కామెంట్స్..