Upasana Konidela: మరో అరుదైన గౌరవాన్ని దక్కించుకున్న మెగా కోడలు ఉపాసన

Upasana Konidela: మరో అరుదైన గౌరవాన్ని దక్కించుకున్న మెగా కోడలు ఉపాసన

మెగా కోడలు, రామ్ చరణ్(Ram charan) సతీమణి ఉపాసన కొణిదెల(Upasana Konidela) అరుదైన గౌరవాన్ని దక్కించుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా వన్యప్రాణుల సంరక్షణ కోసం పనిచేస్తున్న వరల్డ్‌ వైడ్‌ ఫండ్‌ ఫర్‌ నేచర్‌(World Wide Fund for Nature) (డబ్ల్యూడబ్ల్యూఎఫ్‌)లో ఇండియా విభాగానికి ఆమె నేషనల్‌ అంబాసిడర్‌గా నియమితులయ్యారు ఉపాసన. ఈ విషయాన్ని నాగర్‌కర్నూల్‌ డీఎఫ్‌వో రోహిత్‌ గోపిడి అధికారికంగా ప్రకటించారు.

డబ్ల్యూడబ్ల్యూఎఫ్‌ ఇండియా, అపోలో హాస్పిటల్‌ ట్రస్ట్‌ మధ్య జరిగిన ఒప్పందం ప్రకారం.. నాలుగేళ్ల పాటు ఉపాసన ఈ బాధ్యతల్లో కొనసాగనున్నారు. ఇందులో భాగంగా.. వన్యప్రాణుల సంరక్షణ ప్రాంతాల్లో గాయపడిన ప్రాణులకు వైద్యం అందించడమే కాకుండా.. ఆ ప్రాంతాల్లో విధులు నిర్వహించే అటవీశాఖ సిబ్బందికి కూడా అపోలో తరుపున ఉచిత చికిత్సను అందించనున్నారు. దీంతో మెగా అభిమానులు, నెటిజన్స్ సోషల్ మీడియా వేదికగా ఉపాసన కొణిదలకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.