Upasana Konidela: గేమ్ ఛేంజర్ బ్లాక్ బస్టర్ హిట్... కంగ్రాచ్యులేషన్స్ హస్బెండ్ గారు అంటూ విష్ చేసిన ఉపాసన.

టాలీవుడ్ స్టార్ హీరో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన గేమ్ ఛేంజర్ సినిమా శుక్రవారం గ్రాండ్ గా వరల్డ్ వైడ్ రిలీజ్ అయ్యింది. భారీ అంచనాల నడుమ రిలీజ్ అయిన ఈ సినిమా ఆడియన్స్ ఎక్స్‌పెక్టేషన్స్‌ ని మ్యాక్సిమం రీచ్ అయ్యిందని చెప్పవచ్చు. ముఖ్యంగా పొలిటికల్ యాక్షన్ డ్రామా కావడం, ఈ సినిమాలోని సన్నివేశాలు నిజజీవితానికి దగ్గరగా ఉండటం, రామ్ చరణ్ మాస్ యాక్టింగ్, శంకర్ టేకింగ్ వంటివాటితో గేమ్ ఛేంజర్ బ్లాక్ బస్టర్ హిట్ అయ్యిందని చెప్పవచ్చు. 

అయితే గేమ్ ఛేంజర్ రిలీజ్ సందర్భంగా రామ్ చరణ్ సతీమణి ఉపాసన కొణిదెల సోషల్ మీడియా వేదికగా తన భర్తకి విషెష్ తెలిపింది. ఇందులోభాగంగా " కంగ్రాచ్యులేషన్స్ డియర్ హస్బెండ్ గారు.. మీరు రియల్ గా అన్ని విధాలుగా గేమ్ ఛేంజర్ అని ఎక్స్ ద్వారా ట్వీట్ చేసింది. అంతేకాదు పలు మీడియా సంస్థలు గేమ్ ఛేంజర్ సినిమాకి ఇచ్చిన రివ్యూ & రేటింగ్స్ ని కూడా పోస్టర్ ద్వారా షేర్ చేసింది. ఈ పోస్టర్ లో గేమ్ ఛేంజింగ్ బ్లాక్ బస్టర్ అంటూ ప్రశంసించింది. దీంతో రామ్ చరణ్ ఫ్యాన్స్ అంముదం వ్యక్తం చేస్తున్నారు. అలాగే రామ్ చరణ్ సినిమా లైఫ్ లో ఇంతగా సక్సెస్ కావడానికి ఉపాసన కారణమని అలాంటి భార్య దొరకడం రియల్లీ గ్రేట్ అంటూ కామెంట్లు చేస్తున్నారు. 

Also Read :- అత్యాచారం కేసులో ఫన్ బకెట్ భార్గవ్ కి 20 ఏళ్ళు జైలు శిక్ష

ఇక గేమ్ ఛేంజర్ సినిమా విషయానికొస్తే ఈ సినిమాకి తమిళ్ ప్రముఖ డైరెక్టర్ శంకర్ దర్శకత్వం వహించగా టాలీవుడ్ ప్రముఖ సినీ నిర్మాత దిల్ రాజు నిర్మించాడు. ఇందులో రామ్ చరణ్ కి జంటగా అంజలి, కియారా అద్వానీ నటించారు. అయితే ఈసినిమాలోని సాంగ్స్ కోసమే దాదాపుగా రూ.75 కోట్లు ఖర్చు చేశారు. కానీ కొన్ని టెక్నకల్ కారాణాలవల్ల రెండు పాటలు సినిమాలో కట్ చేశారు.