Upasana: ఆమె ఒక్క క్లాస్‌ కూడా మిస్ అవ్వదు.. ఉపాసన స్పెషల్‌ పోస్ట్‌

Upasana: ఆమె ఒక్క క్లాస్‌ కూడా మిస్ అవ్వదు.. ఉపాసన స్పెషల్‌ పోస్ట్‌

మెగాస్టార్ చిరంజీవి తల్లి అంజనా దేవి పుట్టినరోజు నేడు (జనవరి 29). ఈ సందర్భంగా మెగా కోడలు, రామ్ చరణ్ సతీమణి ఉపాసన ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్తో ఆమెకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపింది.

"ఎంతగానో ప్రేమించే, క్రమశిక్షణ కలిగిన నానమ్మకు పుట్టినరోజు శుభాకాంక్షలు. మీతో కలిసి జీవించడం ఎంతో సంతోషంగా ఉంది. యోగా క్లాస్‌ పూర్తైన తర్వాత మా ముఖాల్లో మెరుపు చూడండి. ఆమె ఒక్క క్లాస్‌ కూడా మిస్ అవ్వదు. నిజంగా ఆమె చూపే శ్రద్ధ ఎంతో స్ఫూర్తిదాయకం" అని ఉపాసన ఫోటో షేర్ చేసింది. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటంతో.. మెగా ఫ్యాన్స్ ఆమెకు ట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ పోస్టులు పెడుతున్నారు. 

ఉపాసన విషయానికి వస్తే..

మెగా ఫ్యామిలీకి కోడలుగా తన బాధ్యతలు నిర్వహిస్తూనే.. మరోపక్క అపోలో హాస్పిటల్ వైస్ చైర్మన్ గా, సోషల్ యాక్టివిటీగా కీలక పాత్ర పోషిస్తున్నారు. 2024 ఏడాదిలో ప్రపంచవ్యాప్తంగా వన్యప్రాణుల సంరక్షణ కోసం పనిచేస్తున్న వరల్డ్‌ వైడ్‌ ఫండ్‌ ఫర్‌ నేచర్‌ (World Wide Fund for Nature) (డబ్ల్యూడబ్ల్యూఎఫ్‌)లో ఇండియా విభాగానికి ఆమె నేషనల్‌ అంబాసిడర్‌గా నియమితులయ్యారు. నాలుగేళ్ల పాటు ఉపాసన ఈ బాధ్యతల్లో కొనసాగనున్నారు.