2024 మార్చిలో రాబోయే కొత్త బైకులు ఇవే..

2024 మార్చిలో రాబోయే కొత్త బైకులు ఇవే..

ఫిబ్రవరి నెలలో ఎలక్ట్రిక్ బైకులు, పెట్రోల్, డీజిల్ వేరియంట్లలో అనేక రకాల కొత్త బైకులు లాంచ్ అయ్యాయి. కొన్ని మార్పులు చేర్పులు మరికొన్ని మార్కెట్లోకి వచ్చా యి. అయితే మార్చిలో ఇదే కొనసాగనుంది. మార్చిలో రాబోయే కొత్త బైకుల మోడల్స్, ఫీచర్లు, అడ్వాన్డ్ డ్ టెక్నాలజీ గురించి తెలుసుకుందాం. 

Husqvarna Silverpilen205: మోటార్ బైక్ తయారీ సంస్థ Husqvarna .. ఇటీవల Svartpilen 401, Vitipilen 250 లను విడుదలు చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు అప్ డేటెడ్ మోటార్ బైక్ Husqvarna Silverpilen205  ను త్వరలో విడుదల చేసేందుకు సిద్ధంగా ఉంది. ఈ బైక్  ఫీచర్లు, ప్రత్యేకతల గురించి తెలుసుకుందాం. 

Hero Xoom 125 , Xoom 160: 

Hero కంపెనీ తన రాబోయే స్కూటర్లను EICMA 2023లో ఇటీవల ప్రదర్శించింది. ఈ ఈవెంట్ లో 2024లో వస్తున్న రెండు స్కూటర్లు హీరో జూమ్ 125, హీరో జూమ్ 160 తో పాటు హీరో జూమ్ 110 స్పోర్టియర్ లను విడుదలు చేయనుంది. Xoom 160 అనేది మాక్సీ స్టైల్ స్కూటర్. ఇది మార్చిలో భారత్ లో విడుదల కానుంది. 

బజాజ్ పల్సర్ NS400

బజాజ్ పల్సర్ NS400 బైక్ మార్చి నెలలో విడుదలయ్యే అవకాశం ఉంది. బజాజ్ డోమినార్ 400 తో పోల్చితే సరసమైన, మెరుగైన పనితీరును కోరుకుంటున్న కస్టమర్ల కోసం పల్సర్ NS400 మంచి ఎంపిక. పల్సర్ NS400 రూ. 1.70 లక్షల (ఎక్స్ షోరూమ్ ) ధరతో వస్తున్నట్లు తెలుస్తోంది. ఇది డోమినార్ 400 కంటే చాలా తక్కువ ధరలో లభిస్తుంది.

హోండా యాక్టివా ఎలక్ట్రిక్ 

Honda Activa 6G తో స్కూటర్ విభాగంలో హోండా ఆధిపత్యం చెలాయిస్తున్న విషయం తెలిసిందే. SIAM  సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమేషన్ మ్యానుఫ్యార్చరింగ్ నుంచి ఇటీవల విడుదలైన డేటా ప్రకారం.. ఈ స్కూటర్ ఇప్పుడు భారత దేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న ద్విచక్రవాహనం. మార్చి నెల యాక్టివా ఎలక్ట్రిక్ లాంచ్ తో ఎలక్ట్రిక్ సెక్టార్ లోకి అడుగుపెడుతోంది ఈ జపనీస్ సంస్థ. 

ALSO READ :- WPL 2024: బౌండరీ దగ్గర విన్యాసం..డివిలియర్స్‌ను గుర్తు చేసిన ఆర్సీబీ ప్లేయర్