
న్యూఢిల్లీ: ఈ వారం ఎస్‌ఎంఈ సెగ్మెంట్‌లో 4 ఐపీఓలు ఇన్వెస్టర్ల ముందుకు వస్తున్నాయి. వీటికి అదనంగా మరో ఐదు ఎస్‌ఎంఈ కంపెనీలు మార్కెట్‌లో లిస్టింగ్ కానున్నాయి.
1) డెస్కో ఇన్‌ఫ్రాటెక్ ఐపీఓ సోమవారం (మార్చి 24) ఓపెన్ అవుతుంది. ఈ నెల 26 న ముగుస్తుంది. ఈ పబ్లిక్ ఇష్యూ ద్వారా రూ.30.75 కోట్లు సేకరించాలని కంపెనీ చూస్తోంది. ఒక్కో షేరు రూ.147–150 ప్రైస్ రేంజ్‌లో అందుబాటులో ఉంటుంది. రిటైల్ ఇన్వెస్టర్ కనీసం వెయ్యి షేర్ల కోసం బిడ్స్ వేయాలి. కనీస పెట్టుబడి రూ.1,50,000.
2) శ్రీ అహింస నేచురల్స్ ఐపీఓ ఈ నెల 25న ఓపెనై, 27న ముగుస్తుంది. ఒక్కో షేరుని రూ.113–119 ప్రైస్ రేంజ్‌లో అమ్ముతున్నారు. ఇన్వెస్టర్లు కనీసం 1,200 షేర్ల కోసం బిడ్స్ వేయాలి.
3) ఏటీసీ ఎనర్జీస్ సిస్టమ్ లిమిటెడ్ ఐపీఓ ఇన్వెస్టర్ల ముందుకు ఈ నెల 25 న రానుంది. ఈ నెల 27తో కంపెనీ పబ్లిక్ ఇష్యూ ముగుస్తుంది. ఒక్కో షేరు రూ.112–118 ప్రైస్ రేంజ్‌లో అందుబాటులో ఉంటుంది.
4) ఐడెంటిక్స్‌వెబ్ ఐపీఓ ఈ నెల 24న ఓపెనై, 26న ముగియనుంది. ఈ ఇష్యూ ద్వారా రూ.16.63 కోట్లు సేకరించాలని కంపెనీ చూస్తోంది. ఒక్కో షేరుని రూ.51–54 ప్రైస్ రేంజ్‌లో అమ్ముతున్నారు.
5) యాక్టివ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, ర్యాపిడ్ ఫీట్, గ్రాండ్ కాంటినెంట్ హోటల్స్, డివైన్ హిరా జ్యువెలర్స్, పారాదీప్ పరివాహన్ షేర్లు ఈ వారం ఎన్‌ఎస్‌ఈ ఎస్‌ఎంఈ, బీఎస్‌ఈ ఎస్‌ఎంఈ ప్లాట్‌ఫామ్‌లలో లిస్టింగ్ కానున్నాయి.