Upcoming OTT Releases July 2024: జూలైలో ఓటీటీలోకి రానున్న సినిమాలు, వెబ్ సిరీస్లు..ఈ వారం 24 సినిమాలు స్ట్రీమింగ్

Upcoming OTT Releases July 2024: జూలైలో ఓటీటీలోకి రానున్న సినిమాలు, వెబ్ సిరీస్లు..ఈ వారం 24 సినిమాలు స్ట్రీమింగ్

ఈ జూలై నెలలో ఓటీటీలోకి వచ్చే సినిమాలు, వెబ్ సిరీస్లు డిఫరెంట్ జోనర్స్‌తో స్ట్రీమింగ్ కి రాబోతున్నాయి. క్రైమ్ థ్రిల్లర్, రివేంజ్ డ్రామా, ఫ్యామిలీ, రొమాంటిక్ జోనర్ లో ఇలా ప్రేక్షకులను అలరించడానికి అందుబాటులోకి రానున్నాయి. తెలుగు, తమిళ, హిందీ, మలయాళ వివిధ భాషల్లో రిలీజైన సినిమాలు, వెబ్ సిరీస్‍లు జూలై నెలలో స్ట్రీమింగ్‍ కు అడుగుపెట్టనున్న ఆ మూవీస్ ఏంటీ? వాటి ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌పై ఓ సారి లుక్కేస్తే..

మహారాజ:

వైవిధ్యమైన పాత్రలతో అలరిస్తున్న మక్కల్ సెల్వన్ విజయ్‌సేతుపతి కెరీర్‌లో 50వ చిత్రం ‘మహారాజ’. క‌థ‌, స్క్రీన్‌ప్లే, విజ‌య్ సేతుప‌తి న‌ట‌న‌తో ఈ సినిమా థియేటర్ ఆడియన్స్ ను మెప్పించింది. ట్విస్ట్‌లు, మ‌లుపులతో సాగే ఈ ఎమోషనల్ డ్రామా థ్రిల్లర్  జూన్ 14న థియేటర్లలో రిలీజై రూ.100కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టింది. తమిళంతో పాటు తెలుగులోనూ భారీ వసూళ్లను రాబట్టింది. ఇపుడు ఈ సినిమా  (జూలై 19) మూడో వారం నుంచి స్ట్రీమింగ్‍కు వస్తుందని తెలుస్తోంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో నెట్‍ఫ్లిక్స్ లో మహారాజ స్ట్రీమింగ్‍కు రానుంది. ఈ మూవీని నిథిలన్ స్వామినాథన్ డైరెక్ట్ చేశారు. 

మనమే: 

యంగ్ టాలెంటెడ్ హీరో శర్వానంద్‌, కృతిశెట్టి జంటగా, శ్రీరామ్‌ ఆదిత్య దర్శకత్వంలో ఫ్యామిలీ రొమాంటిక్ డ్రామా జూన్ 7 న థియేటర్లలో రిలీజై ఆడియన్స్ ను ఆకట్టుకుంది.  కథా నేపథ్యం, శర్వానంద్, కృతిశెట్టి నటన, కామెడీ, ఎమోషనల్ సీన్స్ ప్రేక్షకులను వీపరీతంగా ఆకట్టుకున్నాయి.  అయితే, మేకర్స్ అంచనాలకు తగ్గట్టుగా భారీ కలెక్షన్లను రాబట్టలేకపోయింది.ఈ మూవీ జూలైలోనే ఓటీటీలో స్ట్రీమింగ్‍కు రానుంది. ఓటీటీ ప్లాట్‍ఫామ్‍పై మేకర్స్ నుంచి త్వరలోనే అనౌన్స్ మెంట్ వచ్చే అవకాశం ఉంది.

Also Read:రూ.500 కోట్ల మార్కును దాటిన కల్కి కలెక్షన్స్..మరో వారం రోజుల్లో రూ.1000 కోట్ల మార్కును చేరనున్న ప్రభాస్!

శశిమథనం

రొమాంటిక్ లవ్ స్టోరీ గా తెరకెక్కిన తెలుగు వెబ్ సిరీస్ 'శ‌శిమ‌థ‌నం' స్ట్రీమింగ్ కు వచ్చేస్తుంది. ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్‍ఫామ్‍ ఈటీవీ విన్ లో జూలై 4వ తేదీన స్ట్రీమింగ్‍కు రానుంది. పవన్ సిద్ధు, సోనియా సింగ్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ రొమాంటిక్ కామెడీ డ్రామా సిరీస్‍కు వినోద్ గాలి దర్శకత్వం వహించారు. ఈ వెబ్ సిరీస్‌లో శ‌శి గా సోనియా సింగ్‌, మ‌ధ‌న్ పాత్ర‌లో ప‌వ‌న్ సిద్ధు క‌నిపించ‌బోతున్నారు. ఓ యువ‌ జంట మ‌ధ్య అపోహ‌లు, గిల్లిక‌జ్జాల‌తో ఫ‌న్‌గా ఈ సిరీస్ సాగ‌నున్న‌ట్లు తెలుస్తోంది. హీరో సాయిధ‌ర‌మ్‌ తేజ్ బ్లాక్ బాస్టర్ మూవీ విరూపాక్ష‌లో సోనియా సింగ్ ఓ కీల‌క పాత్ర పోషించింది. సుధ అనే అమ్మాయిగా త‌న న‌ట‌న‌తో ఆకట్టుకుంది.

రక్షణ:

ఆర్‌‌‌‌‌‌‌‌ఎక్స్ 100, మంగళవారం లాంటి చిత్రాల్లో బోల్డ్ క్యారెక్టర్స్‌‌‌‌తో ఆకట్టుకున్న పాయల్ రాజ్‌‌‌‌పుత్.. ఈసారి పవర్‌‌‌‌‌‌‌‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌‌‌‌‌‌‌‌గా కనిపించిన  చిత్రం ‘రక్షణ’. ప్రణదీప్ ఠాకూర్‌‌‌‌‌‌‌‌ దర్శకత్వం వహించిన ఈ మూవీ  జూన్ 7న రిలీజై  సీట్ ఎడ్జ్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌‌‌‌తో ఆకట్టుకుంటుంది. రోషన్, మానస్‌‌‌‌, రాజీవ్ క‌‌‌‌న‌‌‌‌కాల‌‌‌‌, వినోద్ బాల‌‌‌‌, శివ‌‌‌‌న్నారాయ‌‌‌‌ణ ఇతర ముఖ్యపాత్రలు పోషించారు. ఈ మూవీ జూలై లో  ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతున్నట్లు తెలుస్తుంది.త్వరలోనే రిలీజ్ డేట్ ను ఆహా తన అధికారిక సోషల్ మీడియాలో ద్వారా ప్రకటించనుంది. 

అగ్నిసాక్షి:

మర్డర్ మిస్టరీతో మరో తెలుగు వెబ్ సిరీస్ అగ్నిసాక్షి స్ట్రీమింగ్ కానుంది. బుల్లితెరపై మంచి ఫాలోయింగ్ ఉన్న నటుడు అంబటి అర్జున్ హీరోగా నటిస్తున్న ఈ వెబ్ సిరీస్ లో ఐశ్వర్య లీడ్ రోల్ పోషిస్తుంది. అగ్నిసాక్షి వెబ్ సిరీస్ చాలా రోజుల క్రితమే అనౌన్స్ చేసినా..రీసెంట్ గానే ఈ సిరీస్ లోని క్యారెక్టర్స్ రివీల్ చేశారు మేకర్స్. ఈ సిరీస్ ను జూలై 12 నుంచి డిస్నీ+ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. 

మీర్జాపూర్‌(Mirzapur):

మీర్జాపూర్‌ ఓటీటీలో ఈ వెబ్ సిరీస్ క్రియేట్ చేసిన సంచలనం అంతా ఇంతా కాదు. ఒక రకంగా చెప్పాలంటే ఇండియన్ ఇండస్ట్రీకి బోల్డ్ కంటెంట్ పరిచయం చేసిందే ఈ సిరీస్ అని చెప్పుకోవచ్చు. డైలాగ్స్ పరంగా కానీ, సన్నివేశాల పరంగా కానీ లిమిట్స్ ను క్రాస్ చేసింది ఈ సిరీస్. అందుకే ఈ సిరీస్ చాలా మందికి స్పెషల్. అంతేకాదు చాలా మందికి మోస్ట్‌ పాపులర్‌ క్రైమ్‌ అండ్ పొలిటికల్ థ్రిల్లర్‌ వెబ్‌సిరీస్‌ లిస్టులో ఉంటుంది మీర్జాపూర్.

ఇప్పటికే ఈ సిరీస్ రెండు సీజన్లను సక్సెస్ ఫుల్ గా కంప్లీట్ చేసుకుంది. ఇక అప్పటి నుండి మీర్జాపూర్ మూడో సీజన్‌ కోసం ఆడియన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. అయితే.. ఈ క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ సిరీస్ మూడో సీజన్‍ జూలై 5న ప్రైమ్ వీడియోలో అడుగుపెట్టనుంది. పంకజ్ త్రిపాఠి, అలీ ఫజల్, రసిక దుగల్, శ్వేత త్రిపాఠి శర్మ, విజయ్ వర్మ, ఇషా తల్వార్ మీర్జాపూర్ మూడో సీజన్‍లో ప్రధాన పాత్రలు పోషించారు.  దీంతో మీర్జాపూర్ లవర్స్ ఫుల్ హ్యాపీగా ఫీలవుతున్నారు. మరి మొదటి రెండు సీజన్స్ లాగే ఈ సీజన్ కూడా భారీ విజయం సాధిస్తుందా చూడాలి.

వైల్డ్ వైల్డ్ పంజాబ్:

వైల్డ్ వైల్డ్ పంజాబ్ మూవీ థియేటర్లలో రిలీజ్ కాకుండా నేరుగా ఓటీటీలోనే ఎంట్రీ ఇస్తోంది. వరుణ్ శర్మ, సన్నీ సింగ్, మనోజ్ సింగ్, జెస్సీ గిల్, పత్రలేఖ, ఇషితా రాజ్ ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ కామెడీ డ్రామా ఫిల్మ్ జూలై 10వ తేదీన అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు రానుంది.ఈ మూవీని డైరెక్టర్ సిమ్రన్‍ప్రీత్ సింగ్ తెరకెక్కించారు. 

కకుడా:

బాలీవుడ్ స్టార్ హీరో రితేశ్ దేశ్‍ముఖ్, సోనాక్షి సిన్హా, షాకిబ్ సలీమ్ మూవీలో ప్రధాన పాత్రలు పోషించిన ‘కకుడా’ సినిమా నేరుగా ఓటీటీలోకి వస్తోంది.ఈ హారర్ కామెడీ మూవీ జూలై 12నుంచి ప్రముఖ  జీ5 ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు రానుంది. ఆదిత్య సర్పోర్ట్‌దార్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు.

మలయాళీ ఫ్రమ్ ఇండియా:

ఓటీటీ ప్లాట్‍ఫామ్‍ల్లో మలయాళం సినిమాలకు స్పెషల్ క్రేజ్ ఉంటుంది. కొత్త మలయాళీ చిత్రాలు ఓటీటీల్లోకి ఎప్పుడు వస్తాయా అని ప్రేక్షకులు ఎదురుచూస్తుంటారు. ఈ క్రమంలోనే మే 1న పొలిటికల్ సెటైర్ కామెడీ డ్రామా ఫిల్మ్ మలయాళీ ఫ్రమ్ ఇండియా. ఈ మూవీ  బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను దక్కించుకుని మంచి హిట్ అందుకుంది. ఈ మలయాళీ ఫ్రమ్ ఇండియా మూవీ జూలై 5 నుంచి ప్రముఖ సోనీ లివ్ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు రానుంది. ఈ మూవీలో నివిన్ పౌలీ, ధ్యాన్ శ్రీనివాసన్, అనస్వర రాజన్ ప్రధాన పాత్రల్లో నటించి మెప్పించారు. 

గరుడన్:

గరుడన్ అనేది వెట్రిమారన్ కథ ఆధారంగా Rసూరి యొక్క ఇటీవలి తమిళ చిత్రం. ఈ మూవీలో విడుదల ఫేమ్ సూరి, M శశికుమార్ మరియు మలయాళ నటుడు ఉన్ని ముకుందన్‌ లు కలిసి నటించి మెప్పించారు. మే 31, 2024న విడుదలైనప్పటి నుండి ఈ మూవీ ప్రశంసలు అందుకుంటూ వస్తోంది. మొదట్లో తక్కువగా అంచనా వేయబడిన ఈ చిత్రం అంచనాలను అధిగమించి..2024లో అత్యధిక వసూళ్లు చేసిన తమిళ చిత్రాలలో ఒకటిగా నిలిచింది. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద దాదాపు రూ. 50 కోట్లకు పైగా కలెక్షన్స్ అందుకుంది. ఈ మూవీ ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో (జూలై 3,2024) నుంచి స్ట్రీమింగ్ కానుంది.

హరోం హర:

సుధీర్ బాబు హీరోగా ‘సెహరి’ఫేమ్ జ్ఞానసాగర్ ద్వారక దర్శకత్వంలో రిలీజై ఆకట్టుకున్న పాన్ ఇండియా మూవీ ‘హరోం హర’. ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ను ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ అమెజాన్ ప్రైమ్ సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ జూలై నెలలో స్ట్రీమింగ్ అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. త్వరలో మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. 


డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ 

రెడ్ స్వాన్ (కొరియన్ వెబ్ సిరీస్)- జూలై 3

ల్యాండ్ ఆఫ్ తనబతా (జపనీస్ వెబ్ సిరీస్)- జూలై 4

అమెజాన్ ప్రైమ్ ఓటీటీ

బాబ్ మార్లీ: వన్ లవ్ (ఇంగ్లీష్ చిత్రం)- జూలై 3

స్పేస్ క్యాడెట్ (ఇంగ్లీష్ సినిమా)- జూలై 4

నెట్‌ఫ్లిక్స్

స్టార్ ట్రెక్ ప్రొడిగీ సీజన్ 2 (ఇంగ్లీష్ వెబ్ సిరీస్)- జూలై 1

అల్విన్ సీజన్ 5 (ఇంగ్లీష్ వెబ్ సిరీస్)- జూలై 1

స్ప్రింట్ (ఇంగ్లీష్ వెబ్ సిరీస్)- జూలై 2

జియో సినిమా

ప్రైమ్ టైమ్ విత్ మూర్తీస్ (హిందీ వెబ్ సిరీస్)- జూలై 3

హీ వెంట్ దట్ వే (ఇంగ్లీష్ సినిమా)- జూలై 5

బుక్ మై షో 

ఇఫ్ (ఇంగ్లీష్ మూవీ)- జూలై 3

ఫ్యూరోసియా ఏ మ్యాడ్ మ్యాక్స్ సాగా (ఇంగ్లీష్ చిత్రం)- జూలై 4

ది సీడింగ్ (ఇంగ్లీష్ సినిమా)- జూలై 5

విజన్స్ (ఫ్రెంచ్ మూవీ)- జూలై 5

హరా (తమిళ సినిమా)- ఆహా తమిళ్ ఓటీటీ- జూలై 5

మలయాళీ ఫ్రమ్ ఇండియా (మలయాళ సినిమా)- సోనీ లివ్ ఓటీటీ- జూలై 5

మందాకిని (మలయాళ మూవీ)- మనోరమ మ్యాక్స్ ఓటీటీ- జూలై 5

  • Beta
Beta feature