ఈ నెలలో విడుదలవుతున్న స్మార్ట్ ఫోన్లు ఇవే..!

ఈ నెలలో విడుదలవుతున్న స్మార్ట్ ఫోన్లు ఇవే..!

ఈ నెలలో విడుదలవుతున్న కొత్త ఫోన్లేవి? వాటి ఫీచర్లేంటి? ధర ఎంత ఉండొచ్చు? తెలుసుకోవాలనుకుంటే ఇక్కడ ఓ లుక్కేయండి. మీకు కావాల్సిన ఫోన్లేంటో చెక్​ చేసుకోండి.

ఒప్పో రెనో3 ప్రొ

‘ఒప్పో’ నుంచి రానున్న మరో ఫ్లాగ్‌‌షిప్‌‌ ఫోన్‌‌ ‘రెనో3 ప్రొ’. ఈ నెల మూడో వారంలో రిలీజయ్యే చాన్సుంది.

  6.6 అంగుళాల స్క్రీన్‌‌    స్నాప్‌‌డ్రాగన్‌‌ 765 జి ప్రాసెసర్‌‌‌‌    ఆండ్రాయిడ్‌‌ 10

  క్వాడ్రపుల్‌‌ కెమెరా (48+13+8+2ఎంపీ)    32 ఎంపీ ఫ్రంట్‌‌ కెమెరా

  6జీబీ/8జీబీ, 128జీబీ/256జీబీ   4025 ఎంఏహెచ్‌‌ బ్యాటరీ    ధర: సుమారు రూ.40,790

రియల్‌‌మి 6

మీడియం రేంజ్‌‌ సెగ్మెంట్‌‌లో ‘రియల్‌‌మి’ నుంచి రానున్న మరో ఫోన్‌‌ ఇది. ఈ నెల 13న విడుదలవ్వొచ్చు.

  6.4 అంగుళాల స్క్రీన్‌‌

   స్నాప్‌‌డ్రాగన్‌‌ 710 ప్రాసెసర్‌‌‌‌

  క్వాడ్రపుల్‌‌ కెమెరా (48+8+2+2ఎంపీ)

  20 ఎంపీ ఫ్రంట్‌‌ కెమెరా

  4జీబీ/64జీబీ

  4,200 ఎంఏహెచ్‌‌ బ్యాటరీ

  ధర: సుమారు రూ.11,999

గెలాక్సీ ఎస్‌‌20 సిరీస్‌‌

‘సామ్‌‌సంగ్‌‌’ నుంచి ‘గెలాక్సీ’ సిరీస్‌‌లో వచ్చిన ‘ఎస్‌‌ 10’కు అప్‌‌డేటెడ్‌‌ ఫోన్‌‌ ఇది.
దీన్ని మొదట్లో ‘గెలాక్సీ ఎస్‌‌11’గా అన్నారు.
అయితే ‘గెలాక్సీ ఎస్‌‌20’ సిరీస్‌‌లో ‘గెలాక్సీ ఎస్‌‌ 20’, ‘ఎస్‌‌ 20 ప్లస్‌‌’, ‘ఎస్‌‌ 20 అల్ట్రా’ పేరుతో మూడు మోడల్స్‌‌ వచ్చే చాన్సుంది. ఈ నెల 11న రిలీజ్‌‌. వీటిలో ఉండే మెయిన్‌‌ ఫీచర్లివి.

  6.2 అంగుళాల స్క్రీన్‌‌

   ఆండ్రాయిడ్‌‌ 10

  స్నాప్‌‌డ్రాగన్‌‌ 865 ప్రాసెసర్‌‌‌‌

  6జీబీ/128జీబీ

  ట్రిపుల్‌‌ రేర్‌‌‌‌ కెమెరా (12+64+12ఎంపీ)

  10 ఎంపీ సెల్ఫీ కెమెరా

  4,000 ఎంఏహెచ్‌‌ బ్యాటరీ

   ధర: సుమారు రూ.78,990

పోకో ఎక్స్‌‌2

షావోమీకి చెందిన ‘పోకో ఎఫ్‌‌1’ ఫోన్‌‌ మార్కెట్లో విడుదలైంది. తాజాగా నిన్న (మంగళవారం) ‘పోకో ఎక్స్‌‌ 2’ రిలీజైంది. మోస్ట్‌‌ అవైటెడ్‌‌ ఫోన్స్‌‌లో ఇదీ ఒకటి.

  6.67 అంగుళాల స్క్రీన్‌‌   ఆండ్రాయిడ్‌‌ 10

  స్నాప్‌‌డ్రాగన్‌‌ 730 జి ప్రాసెసర్‌‌‌‌

  6జీబీ/8జీబీ, 128/256జీబీ

  క్వాడ్రపుల్‌‌ కెమెరాస్‌‌ (64+8+2+2ఎంపీ)

  డ్యుయల్‌‌ సెల్ఫీ కెమెరా (20+2ఎంపీ)

  4,500 ఎంఏహెచ్‌‌ బ్యాటరీ   47 వాట్స్‌‌ ఫాస్ట్‌‌ చార్జింగ్‌‌

  ధర: సుమారు రూ.15,999

రియల్‌‌మి సి3

‘ఒప్పో’ కో బ్రాండ్‌‌ ‘రియల్‌‌మి’ నుంచి మీడియం సెగ్మెంట్‌‌లో ‘రియల్‌‌మి సి3’ ఈ నెల 6న విడుదలవుతోంది.

  6.5 అంగుళాల మినీ డ్రాప్‌‌ స్క్రీన్‌‌

   ఆండ్రాయిడ్‌‌ 10

   మీడియాటెక్‌‌ హెలియో జీ70 ప్రాసెసర్‌‌‌‌

  3జీబీ/32జీబీ, 4జీబీ/64జీబీ

  ఏఐ డ్యుయల్‌‌ కెమెరా (12+2ఎంపీ)

  8 ఎంపీ సెల్ఫీ కెమెరా

  5,000 ఎంఏహెచ్‌‌ బ్యాటరీ

  ధర: సుమారు రూ.7,999

ఎంఐ ఏ4

‘షావోమీ’ నుంచి వస్తున్న మరో మీడియం రేంజ్‌‌ ఫోన్‌‌ ‘ఎంఐ ఏ4’. ఈ నెల 20న రిలీజవనుంది.

  6.5 అంగుళాల డిస్‌‌ప్లే

   ఆండ్రాయిడ్‌‌ 10

  స్నాప్‌‌డ్రాగన్‌‌ 712 ప్రాసెసర్‌‌‌‌

  4జీబీ/64జీబీ

  క్వాడ్రపుల్‌‌ కెమెరా (48+8+2+2ఎంపీ)

  32 ఎంపీ ఫ్రంట్‌‌ కెమెరా

  4050 ఎంఏహెచ్‌‌ బ్యాటరీ

  ధర: సుమారు రూ.13,999

సోనీ ఎక్స్‌‌పీరియా 5 ప్లస్‌‌

‘సోనీ’ కంపెనీ నుంచి ‘ఎక్స్‌‌పీరియా’ బ్రాండ్‌‌లో రానున్న మరో హైఎండ్‌‌ ఫోన్‌‌ ఇది. ఈ నెల 24న రిలీజవుతోంది.

  6.6 అంగుళాల డిస్‌‌ప్లే   ఆండ్రాయిడ్‌‌ 10

   స్నాప్‌‌డ్రాగన్‌‌ 865 ప్రాసెసర్‌‌‌‌   6జీబీ/128జీబీ

  క్వాడ్రపుల్‌‌ కెమెరా (12+64+12+2ఎంపీ)

  8 ఎంపీ ఫ్రంట్‌‌ కెమెరా   4,000 ఎంఏహెచ్‌‌ బ్యాటరీ

  సైడ్‌‌ మౌంటెడ్‌‌ ఫింగర్‌‌‌‌ప్రింట్‌‌ సెన్సర్‌‌‌‌

  ధర: సుమారు రూ.45,999

ఇన్ఫినిక్స్‌‌ ఎస్‌‌5 ప్రొ

హాంకాంగ్‌‌కు చెందిన ‘ఇన్ఫినిక్స్‌‌’ సంస్థ నుంచి మీడియం రేంజ్‌‌ సెగ్మెంట్‌‌లో రానున్న మరో మోడల్‌‌ ‘ఎస్‌‌ 5 ప్రొ’. ఈ నెల 18న రిలీజవుతోంది.

  6.6 అంగుళాల స్క్రీన్‌‌    ఆండ్రాయిడ్‌‌ 9 ‘పై’

  మీడియాటెక్‌‌ హెలియో పీ22 ప్రాసెసర్‌‌‌‌

  4జీబీ/32/64జీబీ   ట్రిపుల్‌‌ రేర్‌‌‌‌ కెమెరా (16+5+2ఎంపీ0

  32 ఎంపీ ఫ్రంట్‌‌ కెమెరా

  4,000 ఎంఏహెచ్‌‌ బ్యాటరీ    ధర: సుమారు రూ.9999