
కన్నడ స్టార్ ఉపేంద్ర, శ్రియా జంటగా ఆర్.చంద్రు దర్శకత్వంలో రూపొందిన పాన్ ఇండియా చిత్రం ‘కబ్జ’. సుదీప్, ప్రకాష్ రాజ్, జగపతిబాబు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. మార్చి 17న అన్ని భాషల్లో రిలీజ్ కానున్న ఈ చిత్రాన్ని తెలుగులో నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డి విడుదల చేస్తున్నారు. ఇటీవల సాంగ్ లాంచ్ ఈవెంట్‌ను హైదరాబాద్‌లో నిర్వహించారు. విశ్వక్‌సేన్, చంద్రబోస్, సుధాకర్ రెడ్డి కలిసి టైటిల్ సాంగ్‌ను లాంచ్‌ను చేశారు. ఈ సందర్భంగా విశ్వక్ మాట్లాడుతూ ‘ఉపేంద్ర గారి సినిమాలకు నేను పెద్ద ఫ్యాన్‌ను. ఆయన ఐడియాలే నాకు ఇన్‌స్పిరేషన్. ‘కబ్జ’ పెద్ద సక్సెస్ సాధించాలని కోరుకుంటున్నా’ అన్నాడు. ఉపేంద్ర మాట్లాడుతూ ‘భగీరథలా ‘కబ్జ’ చిత్రాన్ని పూర్తి చేశాడు చంద్రు. ఇండియానే కాదు..గ్లోబ్‌నే ‘కబ్జ’ చేస్తాం’ అన్నాడు. ఈ సినిమాలో నటించడం ఆనందంగా ఉందన్నారు శ్రియా. ఆర్.చంద్రు మాట్లాడుతూ ‘ఉపేంద్ర నన్ను చాలా బాగా సపోర్ట్ చేశారు. పాన్ ఇండియా రేంజ్‌లో తీశానంటే ఆయనే కారణం. రవి బస్రూర్ మ్యూజిక్ హైలైట్‌గా ఉంటుంది’ అన్నాడు. దర్శకుడు శ్రీవాస్, నిర్మాతలు డీవీవీ దానయ్య, లగడపాటి శ్రీధర్ తదితరులు కార్యక్రమానికి హాజరై మూవీ టీమ్‌కి ఆల్ ద బెస్ట్ చెప్పారు.