UI The Movie Warner: దర్శకుడిగా ఉపేంద్ర హెచ్చరిక.. 2040లో ప్రపంచం ఎలా ఉండనుంది?

UI The Movie Warner: దర్శకుడిగా ఉపేంద్ర హెచ్చరిక.. 2040లో ప్రపంచం ఎలా ఉండనుంది?

విలక్షణ నటుడిగా, దర్శకుడిగా ఉపేంద్ర(Upendra)కు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. ఆయన సినిమాలంటే ఇష్టపడే ఆడియన్స్ చాలా మందే ఉన్నారు. అయితే కొంత కాలంగా దర్శకత్వానికి దూరంగా ఉంటున్న ఆయన..మరోసారి వినూత్న కాన్సెప్ట్ తో కొత్త సినిమాను తెరకెక్కిస్తున్నారు. దాదాపు ఏడేళ్ల గ్యాప్‌ తర్వాత ఆయన దర్శకుడిగా తీస్తున్న మూవీ UI (UI The Movie)

తాజాగా ఈ మూవీకి సంబంధించిన టీజర్ రిలీజ్ చేశారు మేకర్స్. వార్నర్ (హెచ్చరిక) పేరుతో రిలీజైన ఈ టీజర్ ఆసక్తిగా సాగింది. విస్తరించియున్న డంప్ యార్డ్లో ఆహారం కోసం అలమటిస్తున్న వారిని చూపించారు. అందుకు ఒక అరటి పండు కోసం ఒకరికొకరు చంపుకోవడం.. అందుకు పెద్ద యుద్ధమే జరగడం ఆలోచింపజేస్తోంది.

అయితే, గ్లోబల్ వార్మింగ్, కోవిడ్ -19, ద్రవ్యోల్బణం, AI, నిరుద్యోగం, ప్రపంచ యుద్ధాలు వాటి పర్యవసానాలు ఈ సినిమాలో చూపించనున్నారు. మొత్తానికి ఈ సినిమాతో మరో ప్రయోగం చేస్తున్నారు హీరో ఉపేంద్ర.

విజువల్స్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తోనే వీడియో మైండ్ బ్లోయింగ్ గా ఉంది. సరికొత్త కథాంశంతో వస్తోన్న UI తో మరోసారి ఉపేంద్ర ఏదో కొత్త విషయాన్ని చూపించబోతున్నట్లు తెలుస్తోంది. ఓం, A, ఉపేంద్ర, ఉప్పి 2, సూపర్..లాంటి విభిన్న కథలతో డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న ఉపేంద్ర..ఇపుడు వరల్డ్ ఆఫ్ UI తో వస్తుండటంతో ఫ్యాన్స్ ఖుషు అవుతున్నారు.  

Also Read : ఓటీటీ అవార్డ్స్‌.. సినిమాలు/వెబ్‌ సిరీస్‌ల విజేతలు

గతంలో ''రా' అంటూ ఒక అక్షరాన్నే టైటిల్గా పెట్టిన అభిమానులను అలరించారు ఉపేంద్ర. అంతేకాదు అసలు టైటిలే లేకుండా కేవలం సింబల్ను వాడి  మూవీ తీసిన ఘనత ఉపేంద్రది. ఇప్పుడేమో 'UI' అంటూ రెండు ఇంగ్లీష్ అక్షరాలనే టైటిల్గా పెట్టుకుని భారీ కాన్సెప్ట్ తో వస్తున్నారు. ప్రస్తుతం 'త్రిశూలం' 'బుద్దివంత 2' 'బొజ్జా', రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో ఓ మల్టీ లాంగ్వేజ్ సినిమా చేస్తున్నారు.