UI Box Office Collection Day 6: కన్నడ స్టార్ హీరో రియల్ స్టార్ ఉపేంద్ర హీరోగా నటించిన "యూఐ" సినిమా డిసెంబర్ 20న రిలీజ్ అయ్యింది. రిలీజ్ రోజే మంచి పాజిటివ్ టాక్ తో హిట్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా మొదటి రోజు అన్ని భాషలలో దాదాపుగా రూ.6 కోట్లు కలెక్ట్ చేసి డీసెంట్ కలెక్షన్స్ రాబట్టింది. దీంతో ఉపేంద్ర కి యూఐ సినిమాతో హిట్ ట్రాక్ లో పడ్డాడని అందరూ అనుకున్నారు.
కానీ అనుకోకుండా రెండో రోజు నుంచి కలెక్షన్స్ డ్రాప్ అయ్యాయి. దీంతో ఉపేంద్ర ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు. అయితే యూఐ సినిమా కోసం ఉపేంద్ర బాగానే కష్టపడడ్డాడు. ప్రమోషన్స్ కూడా బాగానే చేశాడు. కానీ సినిమాలోని కమర్షియల్ ఎలిమెంట్స్ పై కాకుండా రియల్ లైఫ్ లో జరిగే విషయాలని చూపించే ప్రయత్నం చేశాడు.
ALSO READ | పుష్ప రాజ్ బాటలోనే రామ్ చరణ్... ఇండియా వైడ్ గా అలా చేయబోతున్నాడా..?
కాసేపైనా సినిమా చూసి బాధలు మర్చిపోవడానికి థియేటర్ కి వస్తే ఇక్కడకూడా ఇదేనా అంటూ ఆడియన్స్ పెద్దగా ఎంకరేజ్ చెయ్యడంలేదు. దీంతో 6 రోజుల్లో రూ.23.85 కోట్లు కలెక్ట్ చేసింది. ఈ క్రమంలో 6వ రోజు sacnilk సమాచారం ప్రకారం రూ.1.3 కోట్లు మాత్రమే కలెక్ట్ చేసినట్లు తెలుస్తోంది. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ కూడా కష్టమేనని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం తమిళ్ ప్రముఖ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ దర్శకత్వం వహిస్తున్న "కూలీ" అనే సినిమాలో కామియో అప్పియరెన్స్ పాత్రలో నటిస్తున్నాడు. ఈ సినిమాలో మెయిన్ హీరోగా రజనీకాంత్ నటిస్తున్నాడు. ఈ సినిమా వచ్చే ఏడాది సమ్మర్ లో రిలీజ్ చేసందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తున్నారు.