సినిమా మేకర్స్ అందరూ చెప్పే ఒకే ఒక మాట.. ఇది చాలా కొత్త కంటెంట్, డిఫరెంట్ గా ట్రై చేసాం, ఈ కథ చాలా కొత్తగా ఉంటుంది అని. కానీ సినిమా చూశాక మాత్రం చాలా వరకు రొటీన్ గానే ఉంటాయి. కొంత మంది మాత్రం వాళ్ళు చెప్పినట్టుగానే ఆడియన్స్ కు కొత్త, డిఫెరెంట్ కంటెంట్ ఇవ్వడానికి ట్రై చేస్తూ ఉంటారు. అందులో కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర(Upendra) ఒకరు.
ఆయన సినిమాలు, ఎంచుకునే కాన్సెప్ట్స్ రెగ్యులర్ సినిమాలకు చాలా డిఫరెంటుగా ఉంటాయి. అందులో భాగంగా వచ్చినవే.. ఉపేంద్ర, రా, ఓం,బుద్దిమంతుడు, వంటి సినిమాలు. ఆయన తీసిన ఏ ఒక్క సినిమా కూడా మామూలు కమర్షియల్ సినిమాల్లా ఉండవు. అందుకే ఉపేంద్ర చేసే సినిమాలకు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. ఇక చాలా కాలం తరువాత ఆయన దర్శకత్వం లో చేస్తున్న సినిమా UI. టైటిల్ తోనే ఈ కూడా చాలా కొత్తగా ఉండబోతుందని హింట్ ఇచ్చారు ఉపేంద్ర.
ALSO READ: రతిక.. ఎందుకంత ఓవరాక్షన్.. భరించలేకపోతున్నాం!
తాజాగా ఈ సినిమా నుండి టీజర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఈ టీజర్ ను కూడా చాలా కొత్తగా కట్ చేశారు ఉపేంద్ర. టీజర్ లో ఒక్క విజువల్ కూడా లేదు. అంతా చీకటి. దాదాపు రెండు నిమిషాల పైగా డ్యూరేషన్ తో ఉన్న ఈ టీజర్ లో బ్యాగ్రౌండ్ మ్యూజిక్, సౌండ్స్, డైలాగ్స్ తప్పా.. ఒక్క విజువల్స్ ను కూడా చూపించలేదు. పైగా టీజర్ చివరిలో విజువల్స్ మీకు ఊహకే వదిలేస్తున్నా.. అనే కొటేషన్ తో ముగించారు. దీంతో ఏ సినిమాపై ఆడియన్స్ లో ఆసక్తి పెరిగింది. అంతేకాదు.. ఈ టీజర్ చూసిన ఆడియన్స్.. ఉప్పి సార్ మీరు చాలా డిఫరెంట్ సార్, విజువల్స్ లేకుండా టీజర్ రిలీజ్ చేశారంటే మీ గట్స్ కి హ్యాట్సాఫ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక పాన్ ఇండియా లెవల్లో రిలీజ్ కానున్న ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.