ఉపేంద్ర యుఐ ది మూవీ .. సెన్సార్ కంప్లీట్

ఉపేంద్ర యుఐ ది మూవీ .. సెన్సార్ కంప్లీట్

కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర హీరోగా నటిస్తూ, దర్శకుడిగా తెరకెక్కిస్తున్న చిత్రం ‘యుఐ ది మూవీ’.  లహరి ఫిల్మ్స్, జి మనోహరన్, వీనస్ ఎంటర్‌‌టైనర్స్ కెపి శ్రీకాంత్ నిర్మిస్తున్నారు. ఇటీవల విడుదల చేసిన వార్నర్‌‌‌‌ వీడియోకు మంచి స్పందన లభించింది.  తాజాగా యూ/ఏ సర్టిఫికెట్‌‌తో సెన్సార్‌‌‌‌ కార్యక్రమాలు పూర్తయ్యాయి.  ఈ సందర్భంగా విడుదల చేసిన పోస్టర్స్ ఆకట్టుకున్నాయి.  

రీష్మా నానయ్య, మురళీ శర్మ, సన్నీలియోన్, నిధి సుబ్బయ్య, సాధు కోకిల, మురళీ కృష్ణ ఇతర పాత్రలు పోషిస్తున్నారు. అజనీష్ బి లోక్‌‌నాథ్ సంగీతం అందిస్తున్నాడు.  గీతా ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్స్ సంస్థ ఈ చిత్రాన్ని తెలుగులో విడుదల చేయబోతోంది.  డిసెంబర్ 20న రిలీజ్ కానుంది.