UPI యూజర్లకు బ్యాడ్న్యూస్..డిజిటల్ పేమెంట్లపై ఛార్జీల మోత

UPI యూజర్లకు బ్యాడ్న్యూస్..డిజిటల్ పేమెంట్లపై ఛార్జీల మోత

UPI యూజర్లకు బ్యాడ్న్యూస్..ఇకపై పేమెంట్లపై ఛార్జీల మోత మోగనుంది. తక్కువ మొత్తం యూపీఐ లావాదేవీలు,  RuPay డెబిట్ కార్డు చెల్లింపులకు ప్రభుత్వ సపోర్టు తగ్గడంతో యూపీఐ యాప్ లు నష్టాన్ని పూడ్చుకునే పనిలో పడ్డాయి. ఇకనుంచి యూపీఐ యూజర్లనుంచి కన్వీనియెన్స్ ఛార్జీలు వసూలు చేయడం ప్రారంభించాయి. 

గూగుల్ పే వంటి ప్లాట్‌ఫామ్‌లు విద్యుత్, వంట గ్యాస్ ,క్రెడిట్ కార్డ్ లావాదేవీలతో సహా బిల్లు చెల్లింపులపై ఛార్జీలు వసూలు చేస్తున్నాయి. ఇవి గతంలో తక్కువ-విలువ చెల్లింపులకు ఉచితం. అయితే నేరుగా బ్యాంక్ ఖాతాలకు లింక్ చేయబడిన UPI లావాదేవీలు మాత్రం ఛార్జీలు ఉండవు. 

UPI , RuPay డెబిట్ కార్డ్ రీయింబర్స్‌మెంట్‌ల కోసం బడ్జెట్ కేటాయింపులు గతేడాది కంటే తగ్గించింది కేంద్ర ప్రభుత్వం. 2024లో రూ. 2,484 కోట్లుగా ఉన్న కేటాయింపులు 2025 లో రూ. 2వేలకోట్లకు తగ్గించారు. FY26కి రూ. 437 కోట్లకు తగ్గించారు. దీంతో పేమెంట్స్ సర్వీస్ ప్రొవైడర్లు (PSP)లు, థర్డ్ పార్టీ ప్రొవైడర్లు(TPAP) పునరాలోచనలో పడ్డాయి. ఇది UPIపేమెంట్లపై ఛార్జీలకు దారితీసింది.