GPay, Paytm, Phonepe పనిచేయట్లే..ఇబ్బందుల్లో యూజర్లు

GPay, Paytm, Phonepe పనిచేయట్లే..ఇబ్బందుల్లో యూజర్లు

డిజిటల్‌ చెల్లింపుల వ్యవస్థ యూపీఐ(UPI) సేవల్లో అంతరాయం ఏర్పడింది. దీంతో GPay, Paytmతో పాటు ఇతర యూపీఐ యాప్స్ పనిచేయడం లేదు. బుధవారం (మార్చి 26) సాయంత్రం 7గంటల నుంచి యూపీఐ సమస్యలు తలెత్తినట్లు తెలుస్తోంది. దీంతో యూజర్లు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పలువురు యూజర్లు సోషల్ మీడియాలో పోస్టులు షేర్ చేస్తున్నారు. భారతదేశం అంతటా కస్టమర్లు యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (UPI) లావాదేవీలలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. డౌన్‌డెటెక్టర్ ప్రకారం..Google Pay, Paytm ,ఇతర బ్యాంకింగ్ యాప్‌లలో చెల్లింపులు నిలిచిపోయాయి. ఇది లావాదేవీలు, మనీ బదిలీలు ,లాగిన్ యాక్సెస్‌ నిలిచిపోయినట్లు తెలుస్తోంది. 

దేశవ్యాప్తంగా UPI సేవలు ఎందుకు నిలిచిపోయాయనే దానిపై UPI ఇంకా ఎటువంటి అధికారిక ప్రకటనను విడుదల చేయలేదు. అయితే యూపీఐ ద్వారా చెల్లింపు చేయడానికి ప్రయత్నిస్తే.. ప్రారంభంలో, డబ్బు ఖాతా నుంచి డెబిట్ అయినప్పటికీ తర్వాత లావాదేవీల్లో అంతరాయం ఏర్పడినట్టు మేసేజ్ వస్తున్నట్లు యూజర్లు సోషల్ మీడియాలో పోస్టులు షేర్ చేస్తున్నారు. ‘‘భారతదేశంలో UPI డౌన్ GPay, Paytm ,ఇతర UPI యాప్‌ల ద్వారా చెల్లింపులతో కస్టమర్లు సమస్యలను ఎదుర్కొంటున్నారు’’ అనే మెసేజ్ వస్తుందని పోస్టులు పెడుతున్నారు. 

BREAKING: UPI servers are acting up across India — payments stuck, apps crashing, and chaos at cash counters!
Is this a server overload… or something bigger?
Digital India just caught a glitch.#UPI #UPIDown #DigitalIndia #Fintech #RBI pic.twitter.com/Pp0pbtawiE

— Richard Pathray (@pathray_ri77258) March 26, 2025