UPI Down: గూగుల్ పే, పేటీఎం, ఫోన్ పే పని చేయటం లేదు.. షాపుల దగ్గర కస్టమర్లు, వ్యాపారుల పరేషాన్

UPI Down: గూగుల్ పే, పేటీఎం, ఫోన్ పే పని చేయటం లేదు.. షాపుల దగ్గర కస్టమర్లు, వ్యాపారుల పరేషాన్

న్యూఢిల్లీ: డిజిటల్ పేమెంట్స్ బ్రేక్ అయ్యాయి.. గూగుల్ పే, పేటీఎం, ఫోన్ పే పని చేయటం లేదు. సర్వర్లు డౌన్ కావటంతో.. పేమెంట్ కావటం లేదంటూ కస్టమర్లు X వేదికగా కామెంట్స్ చేస్తున్నారు. యూపీఐ పేమెంట్స్ డౌన్ కావటంతో .. ఈ వారంలో ఇది రెండో సారి. చేతిలో ఫోన్ ఉంటే చాలు.. పేమెంట్ ఇట్టే అయిపోతుంది.. ఈ ఉద్దేశంతోనే చాలా మంది డబ్బులు క్యారీ చేయటం లేదు. ఈ క్రమంలోనే హోటల్స్, మార్కెట్లు, సూపర్ మార్కెట్లు, మాల్స్, టీ షాపులు, టిఫిన్ సెంటర్ల దగ్గర యూపీఐ పేమెంట్స్ కాకపోవటంతో.. కస్టమర్లు, వ్యాపారులు గందరగోళానికి గురవుతున్నారు. చేతిలో డబ్బులు లేక.. యూపీఐ పేమెంట్ కాకపోవటంతో.. అసహనానికి గురవుతున్నారు కస్టమర్లు..

దేశ వ్యాప్తంగా మరోసారి డిజిటల్ చెల్లింపులకు అంతరాయం ఏర్పడింది. యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (UPI) సర్వర్ డౌన్ కావడంతో గూగుల్ పే,పేటీఎం, ఫోన్ పే వంటి యూపీఐ యాప్స్ నిలిచిపోయాయి. గూగుల్ పే, పేటీఎం, ఫోన్ పే యాపుల్లో పేమెంట్స్ ఫెయిల్ కావడంతో కస్టమర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ట్రాన్సక్షన్స్ జరపడంలో సమస్యలు రావడంతో గందరగోళానికి గురయ్యారు. 

పేమెంట్ ఫెయిల్ అయిన స్క్రీన్ షాట్లు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. బ్యాలెన్స్ చెక్ చేసుకుందామన్న యాప్‎లు పని చేయడం లేదని పోస్టుల్లో పేర్కొన్నారు. వారంలోనే యూపీఐ సేవల్లో అంతరాయం ఏర్పడటం ఇది రెండోసారి. ఇటీవల యూపీఐ సేవల్లో తరుచుగా సమస్యలు తలెత్తుతుండంతో వినియోగదారులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. డౌన్ డిటెక్టర్ నివేదిక ప్రకారం.. 2025, ఏప్రిల్ 12వ తేదీ ఉదయం నుంచి 11 వందలకుపైగా కంప్లయింట్ వచ్చాయి.

 ఈ కంప్లయింట్స్‎లో గూగుల్ పే, పేటీఎం, ఫోన్ పే సర్వీసులకు సంబంధించివి ఉన్నట్లు వెల్లడించింది ఆ నివేదిక. డిజిటల్ పేమెంట్స్ నిలిచిపోవడానికి, సమస్యలు తలెత్తడానికి ప్రస్తుతానికి కారణం ఇంకా తెలియదు. అయితే  వీటిపై సంబంధిత బ్యాంకులు కానీ..  యాప్స్ కానీ వీటితో  పాటు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) ఎలాంటి అధికారిక ప్రకటన విడుదల చేయలేదు.