యూపీఐ  లైట్​ లిమిట్​ పెంపు

యూపీఐ  లైట్​ లిమిట్​ పెంపు

న్యూఢిల్లీ : గూగుల్​పే, ఫోన్​పే వంటి యాప్స్​ద్వారా లావాదేవీలకు వినియోగించే యూనిఫైడ్ ​పేమెంట్​ఇంటర్​ఫేస్​(యూపీఐ) విధానంలో ఈ నెల నుంచి రెండు కొత్త మార్పులు వచ్చాయి. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్​పీసీఐ)  యూపీఐ లైట్​ కోసం ఆటో టాపప్ ఫీచర్​ను తీసుకొచ్చింది. యూపీఐ లైట్​లిమిట్​ను పెంచింది. కొత్త మార్గదర్శకాల ప్రకారం, వినియోగదారులు ఇప్పుడు పిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ఎంటర్​ చేయకుండానే వెయ్యి రూపాయల వరకు లావాదేవీలు చేయవచ్చు. ఇది మునుపటి పరిమితి రూ. 500 కంటే రెట్టింపు.

వాలెట్ బ్యాలెన్స్ పరిమితి కూడా రూ. 2వేల నుంచి రూ. 5వేలకి పెంచారు.  ముందుగా నిర్ణయించిన పరిమితి కంటే బ్యాలెన్స్ తగ్గినప్పుడు ఆటో టాపప్ ఫీచర్ వినియోగదారుడు యూపీఐ లైట్ ఖాతాను ఆటోమేటిక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా రీచార్జ్ చేసుకోవచ్చు. గత నెల రూ. 23.5 లక్షల కోట్ల విలువైన 16.58 బిలియన్ల యూపీఐ లావాదేవీలు జరిగాయని ఎన్​పీసీఐ తెలిపింది.