- తర్వాతి ప్లేస్‌లో బై నౌ పే లేటర్ పీడబ్ల్యూసీ రిపోర్ట్ వెల్లడి
న్యూఢిల్లీ: బై నౌ పే లేటర్ (బీఎన్‌పీఎల్), డిజిటల్ కరెన్సీ వంటి కొత్త పేమెంట్ విధానాలు వచ్చినప్పటికీ, యూపీఐ హవా కొనసాగుతుందని పీఎడబ్ల్యూసీ ఇండియా రిపోర్ట్ పేర్కొంది. వచ్చే ఐదేళ్లలో డిజిటల్ పేమెంట్ సెగ్మెంట్‌ను యూపీఐ, బీఎన్‌పీఎల్, సీబీడీసీ, ఆఫ్‌లైన్ పేమెంట్స్ (కార్డులు) నడిపిస్తాయని అంచనా వేసింది. డిజిటల్ పేమెంట్స్‌లో యూపీఐ టాప్ పొజిషన్‌లో కొనసాగుతుందని, సెకెండ్ ప్లేస్‌లో బీఎన్‌పీఎల్ ఉంటుందని పీడబ్ల్యూసీ పేర్కొంది. ఈ రిపోర్ట్ ప్రకారం, దేశంలో డిజిటల్ పేమెంట్స్ సెగ్మెంట్ ఏడాదికి 23 శాతం గ్రోత్ రేటుతో నిలకడగా వృద్ధి చెందుతుంది. ప్రస్తుతం ఉన్న 5,900 కోట్ల డిజిటల్ పేమెంట్ ట్రాన్సాక్షన్లు 2025–26 నాటికి 21,700 కోట్లకు చేరుకుంటాయని పీడబ్ల్యూసీ వివరించింది.
16,900 కోట్ల యూపీఐ ట్రాన్సాక్షన్లు!
దేశంలో యూపీఐ ట్రాన్సాక్షన్లు 2020–21లో 2,200 కోట్లకు చేరుకున్నాయి. ఈ నెంబర్ 2025–26 నాటికి 16,900 కోట్లకు చేరుకుంటుందని పీడబ్ల్యూసీ రిపోర్ట్ వెల్లడించింది. ఇది ఏడాదికి 122 శాతం గ్రోత్. ఆసియాలోని ఇతర దేశాలతో టై అప్ అవ్వడం, విదేశాలకు యూపీఐ ద్వారా రెమిటెన్స్ పంపుకోవడానికి వీలు కలిపిస్తుండడంతో యూపీఐ ట్రాన్సాక్షన్లు భారీగా పెరుగుతాయని ఈ రిపోర్ట్ అంచనావేసింది. బై నౌ పే లేటర్ (బీఎన్‌పీఎల్) మార్కెట్ ప్రస్తుతం రూ. 36,300 కోట్లుగా ఉందని అంచనా. ఈ వాల్యూ 2025–26 నాటికి రూ. 3.19 లక్షల కోట్లకు చేరుకుంటుందని ఈ రిపోర్ట్ అంచనావేసింది. ‘కస్టమర్ల ఎక్స్‌పీరియెన్స్‌ను, సెక్యూరిటీని మెరుగుపరచడానికి పేమెంట్ ఇండస్ట్రీ ఎక్కువ ప్రాధాన్యం ఇస్తోంది. కొత్త పేమెంట్ ఆప్షన్స్‌ను అందిస్తోంది. డిస్ట్రిబ్యూటెడ్ లెడ్జర్ టెక్నాలజీ (డీఎల్‌టీ), ఐఓటీ వంటి కొత్త టెక్నాలజీలను వచ్చే రెండేళ్లలో తీసుకురావాలని చూస్తోంది’ అని పీడబ్ల్యూసీ ఇండియా పార్టనర్ మిహిర్ గాంధి అన్నారు. రెగ్యులేటర్లు, బ్యాంకులు, ఫిన్‌టెక్ కంపెనీలు, కార్డు నెట్‌వర్క్ కంపెనీలు, సర్వీస్ ప్రొవైడర్ల ప్రయత్నాలతో పేమెంట్ ఇండస్ట్రీ భారీగా విస్తరిస్తుందని అంచనావేశారు.