మన దేశంలో డిజిటల్ పేమెంట్స్ సర్వ సాధారణం అయిపోయాయి. ఇంటర్నెట్ అందరికీ అందుబాటులోకి రావడం, బ్యాంకు ఖాతా ఉన్న మెజారిటీ ప్రజలు స్మార్ట్ ఫోన్ వాడుతుండటంతో యూపీఐ పేమెంట్స్ భారీగా పెరిగాయి. ఛాయ్ దుకాణాల నుంచి బంగారం దుకాణాల దాకా ‘‘ఫోన్ తీయ్.. క్యూఆర్ కోడ్ను స్కాన్ చేయ్’’ అనే రీతిలో ట్రాన్షాక్షన్స్ నడుస్తున్నాయి. లిక్విడ్ క్యాష్ వాడకం తగ్గించి డిజిటల్ పేమెంట్స్ చేస్తున్న వారికి రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా గుడ్ న్యూస్ చెప్పింది. ఈ విషయం తెలిస్తే డిజిటల్ పేమెంట్స్ చేస్తున్న వారిలో చాలామంది చింతలు తీరిపోయినట్టే.
ఇంతకీ.. విషయం ఏంటంటే యూపీఐ పేమెంట్స్ చేసే సందర్భాల్లో యూజర్లు కొన్నిసార్లు డబ్బును పొరపాటున ఒకరికి పంపబోయి మరొకరికి పంపుతుంటారు. ఆ తర్వాత ఆ డబ్బును తిరిగి తెచ్చుకోవడానికి నానా తంటాలు పడుతుంటారు. ఇకపై.. ఆ తిప్పలు కాస్తంత తగ్గించుకునే అవకాశం ఉంది. కొత్త మార్గదర్శకాల ప్రకారం ‘రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా’ ఒక టోల్ ఫ్రీ నంబర్ను అందుబాటులోకి తెచ్చింది.
Also Read:-స్పల్పంగా పెరిగిన బంగారం, వెండి ధరలు
పొరపాటున డబ్బును ఒకరికి పంపబోయి మరొకరికి పంపి ఉంటే వెంటనే 18001201740 టోల్ ఫ్రీ నంబర్ కు కాల్ చేసి వారికి ఎదురైన సమస్యను తెలియజేయాలి. ఈ ఫిర్యాదు అందుకున్న 48 గంటల్లో సమస్య పరిష్కారం అవుతుంది. ఆ డబ్బు ఏ ఖాతా నుంచి డెబిట్ అయిందో అదే ఖాతాకు తిరిగి క్రెడిట్ అవుతుంది. ఈ టోల్ ఫ్రీ నంబర్ కు కాల్ చేసి రిపోర్ట్ చేయొచ్చు లేదనుకుంటే నేరుగా బ్యాంకుకు వెళ్లి కంప్లైంట్ చేయొచ్చు. కానీ బ్యాంకులో అయితే ఒక ఫామ్ నింపాల్సి ఉంటుంది. తిరిగి డబ్బు ఖాతాలోకి రావడానికి కాస్తంత ఎక్కువ సమయం పడుతుంది. బ్యాంకు సిబ్బంది కూడా ఈ డిజిటల్ పేమెంట్స్ సంబంధిత సమస్యలపై త్వరితగతిన స్పందించకపోవచ్చు. రోజువారీ పనుల్లో తలమునకలై పెద్దగా పట్టించుకోకపోవచ్చు. అందువల్ల.. ఈ టోల్ ఫ్రీ నంబర్ ఎక్కువ మందికి ఉపయోగపడే అవకాశం ఉంది. యూపీఐ మోడ్లో పేమెంట్స్ చేసిన వారికి మాత్రమే ఈ వెసులుబాటు ఉంది. టోల్ ఫ్రీ నంబర్ కు కాల్ చేసి విషయం ఇది అని చెప్తే 48 గంటల్లోగా రిఫండ్ పొందే సదుపాయం అందుబాటులోకి రావడం హర్షనీయం.