యూపీఐ ట్రాన్సాక్షన్లు@ 7.71 లక్షల కోట్లు 

యూపీఐ ట్రాన్సాక్షన్లు@ 7.71 లక్షల కోట్లు 

న్యూఢిల్లీ: యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌‌‌‌ఫేస్ (యూపీఐ) ట్రాన్సాక్షన్లు ఊహించనంత భారీగా పెరుగుతున్నాయి. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్‌‌‌‌పీసీఐ)కు చెందిన ఈ పేమెంట్‌‌‌‌ సిస్టమ్‌‌‌‌ అక్టోబర్‌‌‌‌లో మరో మైలురాయిని సాధించింది. గత నెలలో యూపీఐ ట్రాన్సాక్షన్ల విలువ రూ. 7.71 లక్షల కోట్లు దాటిందని ఎన్‌‌‌‌పీసీఐ ప్రకటించింది. అంటే దాదాపు 100 బిలియన్‌‌‌‌ డాలర్లు! కేవలం 31 రోజుల్లో 421 కోట్ల ట్రాన్సాక్షన్లు జరిగాయని, ఇది ఆల్ టైమ్ హై అని ఎన్‌‌‌‌పీసీఐ వెల్లడించింది. పండగ సీజన్‌‌‌‌ కావడంతో అక్టోబరులో ఇంతటి భారీ గ్రోత్‌‌‌‌ సాధ్యపడింది. ఆన్‌‌‌‌లైన్‌‌‌‌ షాపింగ్‌‌‌‌ భారీగా పెరగడం కూడా కలసి వచ్చింది. వ్యాక్సినేషన్ మరింత పెరగడం, రూల్స్‌‌‌‌ను పూర్తిగా సడలించడంతో జనం కూడా అక్టోబర్‌‌‌‌లో షాపింగ్‌‌‌‌ను పెంచారు.  ఈ ఏడాది మార్చి నుండి సెప్టెంబర్ వరకు యూపీఐ ట్రాన్సాక్షన్ల సగటు నెలవారీ గ్రోత్‌‌‌‌ రేటు 5.8 శాతం వరకు ఉంది. అయితే, అక్టోబర్‌‌‌‌లో ట్రాన్సాక్షన్ల నెలవారీ గ్రోత్‌‌‌‌ ఏకంగా 18 శాతం వరకు ఉంది. ఇదే రేటు కొనసాగితే యూపీఐ ట్రాన్సాక్షన్ విలువ ట్రిలియన్‌‌‌‌ డాలర్లను కూడా తాకవచ్చని ఎక్స్‌‌‌‌పర్టులు చెబుతున్నారు.   ఈ ఏడాదిలో  జనవరిలో ట్రాన్సాక్షన్ల విలువ రూ. 4.31 లక్షల కోట్లు కాగా,  గత నెల వీటి విలువ 79 శాతం పెరిగింది. ఈ జనవరిలో 230 కోట్ల యూపీఐ ట్రాన్సాక్షన్లు రికార్డు కాగా, అక్టోబరు నాటికి ఇవి 83 శాతానికి పైగా పెరిగాయి. 2016లో యూపీఐ మొదలుకాగా,  2020 అక్టోబర్‌‌‌‌లో వీటి విలువ రూ. 3.86 లక్షల కోట్ల మార్కును దాటింది. అంటే గత అక్టోబరుతో పోలిస్తే ఈ సంఖ్య దాదాపు రెండింతలు పెరిగి రూ.7 లక్షల కోట్లు దాటింది. 
ట్రిలియన్‌‌‌‌ డాలర్‌‌‌‌ మైలురాయి సాధ్యమే..
ఈ ఏడాది సెప్టెంబర్ 29న జరిగిన గ్లోబల్ ఫిన్‌‌‌‌టెక్ ఫెస్ట్‌‌‌‌లో ఎన్‌‌‌‌పీసీఐ ఎండీ సీఈఓ దిలీప్ అస్బే మాట్లాడుతూ, 2021లో మొత్తం ఎన్‌‌‌‌పీసీఐ మొత్తం ట్రాన్సాక్షన్లలో యూపీఐ ట్రాన్సాక్షన్ల విలువ దాదాపు 60 శాతానికి దగ్గరగా ఉంటుందని చెప్పారు. ప్రస్తుత గ్రోత్‌‌‌‌రేటును చూస్తే రాబోయే ఐదేళ్లలో రోజుకు లక్ష కోట్ల ట్రాన్సాక్షన్లు జరిగే అవకాశం ఉందని పేర్కొన్నారు. కేవలం మూడు సంవత్సరాల్లోనే ఈ  మైలురాయిని చేరడానికి కష్టపడతామని అన్నారు. యూపీఐ పేమెంట్లు గత ఏడాది కాలంగా భారీగా పెరుగుతున్నాయని మార్కెట్‌‌‌‌ రీసెర్చర్లు చెబుతున్నారు. సులభంగా ఉండడానికి తోడు, కాంటాక్ట్​లెస్​ కావడంతో ఎక్కువ మంది యూపీఐతో డబ్బు చెల్లించడానికి ఇష్టపడుతున్నారని పేర్కొన్నారు. కార్డు పేమెంట్ల కంటే వేగంగా యూపీఐ ట్రాన్సాక్షన్లు పెరుగుతున్నాయని, ఫ్యూచర్లోనూ ఇదే ట్రెండ్​ కొనసాగుతుందని అంటున్నారు. మనదేశంలో ఫోన్‌‌‌‌పే, గూగుల్‌‌‌‌, అమెజాన్‌‌‌‌, పేటీఎం, ఫ్రీచార్జ్‌‌‌‌ సహా దాదాపు అన్ని బ్యాంకులు యూపీఐ సేవలు అందిస్తున్నాయి.