
UPI Transactions: భారతదేశ చెల్లింపుల రూపురేకలను పూర్తిగా మార్చేసింది యూపీఐ చెల్లింపులు. డీమానిటైజేషన్ సమయంలో ఫిన్‌టెక్ కంపెనీలు తీసుకొచ్చిన ఈ డిజిటల్ చెల్లింపుల వ్యవస్థ దేశంలోని మారుమూల ప్రాంతాల ప్రజలకు సైతం పరిచయం అయ్యింది. దీనికి ప్రధాని మోదీ తీసుకొచ్చిన జన్‌ధన్ యోజన కింద తెరవబడిన ఖాతాలు ప్రజలకు సేవలను పొందటాన్ని సులభతరం చేశాయి. ప్రతి నెల యూపీఐ చెల్లింపులు సరికొత్త రికార్డు గరిష్ఠాలను తాకుతూ అత్యంత ప్రజాధరణను పొందుతున్నాయి.
అయితే తాజాగా మార్చి నెలలో యూపీఐ మెుత్తం చెల్లింపుల విలువ రూ.24లక్షల 77వేల కోట్లుగా నమోదయ్యాయి. దీంతో నెల ప్రాతిపధికన ఫిబ్రవరి కంటే చెల్లింపులు ఏకంగా 12 శాతం పెరుగుదలను చూశాయి. దీంతో మెుత్తం 18.3 నుంచి 19.78 బిలియన్ ట్రాన్సాక్షల్లు జరిగినట్లు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ వెల్లడించింది. సగటున రోజున దేశవ్యాప్తంగా ప్రజలు యూపీఐ చెల్లింపుల వ్యవస్థను ఉపయోగించి రూ.79వేల 910 కోట్ల నగదు లావాదేవీలను చేపట్టినట్లు తేలింది. ఇది ప్రజల్లో రోజురోజుకూ యూపీఐ వ్యవస్థపై పెరుగుతున్న నమ్మకాన్ని సూచిస్తోంది.
ALSO READ | మ్యూచువల్ ఫండ్స్ తెలివైన ఆట.. తొందరలో రిటైల్ ఇన్వెస్టర్స్, ఏమైందంటే?
గడచిన వారం రోజుల్లో యూపీఐ చెల్లింపుల వ్యవస్థ రెండు సార్లు యూజర్లకు ఇబ్బందిని కలిగించింది. రోజులో అత్యంత రద్దీ సమయమైన సాయంత్రం వేళల్లో డిజిటల్ పేమెంట్స్ వ్యవస్థ స్థంభించిపోవటం ప్రజలకు తీవ్ర ఇబ్బందులను కలిగించింది. తొలిసారిగా సగటు నెలవారీ ట్రాన్సాక్షన్ల సంఖ్య 24 లక్షల కోట్ల రూపాయలను అధిగమించింది. ఈ క్రమంలో పెరుగుతున్న రద్దీకి అనుగుణంగా ప్రభుత్వ సంస్థ నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ వ్యవస్థలను సంసిద్ధం చేయటం అత్యవసరంగా మారుతోంది.
2025 ఆర్థిక సంవత్సరంలో మెుత్తం యూపీఐ చెల్లింపుల సంస్థ 20 వేల కోట్లకు చేరుకోవచ్చని ప్రభుత్వం అంచనా వేసినప్పటికీ కేవలం 18వేల 500 కోట్ల ట్రాన్సాక్షన్లు మాత్రమే జరిగాయి. ఈ క్రమంలో గత ఆర్థిక సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం రూ.1వెయ్యి 500 కోట్లను సబ్సిడీ రూపంలో సర్వీస్ ప్రొవైడింగ్ సంస్థలకు ప్రోత్సాహకం రూపంలో అందించింది. రానున్న కాలంలో కూడా ప్రజలను భౌతికంగా డబ్బు వినియోగించటాన్ని తగ్గిస్తూ.. డిజిటల్ మార్గాలను వినియోగించేలా ప్రోత్సహించటమే లక్ష్యంగా మోదీ సర్కార్ ముందుకు సాగుతోంది.