UPI transactions:రికార్డు స్థాయిలో యూపీఐ లావాదేవీలు

UPI transactions:రికార్డు స్థాయిలో యూపీఐ లావాదేవీలు

UPI లావాదేవీలు రికార్డు సృష్టించాయి. జనవరిలో యూపీఐ లావాదేవీలు16.99 బిలియన్లు దాటాయి. వీటి విలువ రూ.23.48 లక్షల కోట్లు. గడిచిన ఏడు నెలల్లో ఇదే అత్యధికం అని ఆర్థిక శాఖ ప్రకటించింది. 2024 ఆర్థిక సంవత్సరంలో డిజిటల్ చెల్లింపులు విపరీతంగా పెరిగాయి. దేశవ్యాప్తంగా 80శాతం రిటైల్ చెల్లింపులు యూపీఐ ద్వారా జరిగాయి. 2024 ఆర్థిక సంవత్సరంలో మొత్తం లావాదేవీలు 131 బిలియన్లకు చేరాయి. వీటి విలువ రూ.200లక్షల కోట్లు.

కస్టమర్లు సౌలభ్యం, బ్యాంకుల్లో పెరుగుతున్న నెట్ వర్క్ తో కలిపి ఫిన్ టెక్ ప్లాట్ ఫాంలు యూపీఐ ప్లాట్ ఫాంలను ఏర్పాటు చేయబడ్డాయి. దేశవ్యాప్తంగా లక్షలాది మంది వినియోగదారులకు రియల్ టైమ్ చెల్లింపులకు ప్రాధన్యత నిస్తున్నారు. జనవరి 2025 నాటికి 80కి పైగా UPI యాప్‌లు, 641 బ్యాంకులు UPI వ్యవస్థలో ప్రత్యక్షంగా అందుబాటులో ఉంటాయని కేంద్ర ఆర్థిక శాఖ తెలిపింది.

2025 జనవరి నాటికి పీపుల్ టు మర్చంట్ (P2M) లావాదేవీలు మొత్తం UPI వాల్యూమ్ లో 62.35 శాతం , P2P లావాదేవీలు 37.65 శాతం ఉన్నాయి. P2M లావాదేవీల సహకారం 62.35శాతానికి చేరుకుంది.  ఇక్కడ రూ.500 వరకు లావాదేవీలు 86శాతం ఉంది. తక్కువ విలువ గల చెల్లింపులు చేయడంలో ప్రజలు UPI పై ఎక్కువగా ఆధారపడుతున్నారు.