Cyber Crime Alert: ఇదో రకం మోసం..UPI ద్వారా డబ్బులు పంపించి..ఖాతా ఖాళీ చేస్తున్నారు.. బీ అలెర్ట్

Cyber Crime Alert: ఇదో రకం మోసం..UPI ద్వారా డబ్బులు పంపించి..ఖాతా ఖాళీ చేస్తున్నారు.. బీ అలెర్ట్

ఇటీవల కాలంలో సైబర్ క్రైమ్స్ బాగా పెరిగిపోతున్నాయి. రోజుకో విధంగా సైబర్ ఫ్రాడ్స్టర్లు ఆన్లైన్ మోసాలకు పాల్పడుతున్నారు. ఇప్పటివరకు వ్యక్తి గత డేటాను దొంగిలించి ఆన్ లైన్ మోసాలకు పాల్పడటం.. పోలీసులు, బ్యాంకు అధికారుల పేరుతో ఫోన్లు చేయడం, మేసేజ్ లు పంపించి కస్టమర్లను బ్లాక్ మెయిల్  చేసి బ్యాంకు ఖాతాలు ఖాళీ చేసిన సైబర్ నేరగాళ్లు.. తాజాగా రూట్ మార్చారు. ఇప్పుడు ఎక్కువమంది ప్రజలు వినియోగిస్తున్న UPI ఆన్ లైన్ పేమెంట్స్ ఫ్లాట్ ఫాం ల ద్వారా మోసాలకు పాల్పడుతున్నారు.  జంప్డ్ డిపాజిట్ స్కామ్ పేరుతో కొత్త సైబర్ స్కామ్ కు తెరలేపారు. ఇప్పుడిది యూజర్ల ఆందోళన గురిచేస్తోంది. 

జంప్డ్ డిపాజిట్ స్కా్ం అంటే..UPI ద్వారా బాధితుడి బ్యాంక్ ఖాతాకు కొద్ది మొత్తంలో డబ్బులు బదిలి చేయడంతో మొదలవుతుంది.. కొంతకాలం తర్వాత స్కామర్ చాలా పెద్ద మొత్తానికి పంపించాం.. అకౌంట్ చెక్ చేసుకోవాలని లింక్ పంపిస్తారు. ఊహించని ఈ డిపాజిట్ లింక్ బాధితుడి ఖాతాలో బ్యాలెన్స్ చెక్ చేసుకోమని చెబుతుంది. 

బాధితుడు వారి బ్యాంకింగ్ యాప్ ను తెరచి వివరాలను చెక్ చేయడానికి యూపీఐ పిన్ ఎంటర్ చేయగానే.. స్కామర్లకు నగదు బదిలీ యాక్సెస్ అవుతుంది.. దీంతో వెంటనే డబ్బును స్కామర్లు తమ ఖాతాలకు మళ్లించుకునే అవకాశం ఉంటుంది. 

డిసెంబర్ 2024లో ఇటువంటి జంప్డ్ డిపాజిట్ స్కామ్ ను తమిళనాడు పోలీసుల సైబర్ క్రైమ్ వింగ్ ఫ్లాగ్ చేసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పలు సూచనలు చేసింది. 

మీ డబ్బును ఎలా రక్షించుకోవాలి

  • UPI వినియోగదారులు తమ డబ్బును 'జంప్డ్ డిపాజిట్' స్కామ్ నుండి ఇలా సేవ్ చేసుకోవచ్చు. 
  • మీ ఖాతాను బ్యాలెన్స్ చెక్ చేసుకునే ముందు సమయం తీసుకోవాలి
  • మీ ఖాతాకు క్రెడిట్ నోటిఫికేషన్ వచ్చినప్పుడు వెంటనే బ్యాలెన్స్ చెక్ చేయకుండా వేచి ఉండాలి. 
  • కనీసం 30 నిమిషాలు వేచి ఉండాలి. ఈ ఆలస్యం ఏదైనా మోసపూరిత నగదు బదిలీ రిక్వెస్ట్ ల గడువు ముగియడానికి అవకాశం ఉంది. 
  • దీని వలన స్కామర్లు మీ నిధులను యాక్సెస్ చేయడం అసాధ్యం.

మీ పిన్ తప్పుగా ఎంటర్ చేయండి..

  • ఇలాంటి క్రెడిట్ నోటిఫికేషన్లు వచ్చినప్పుడు వెంటనే బ్యాలెన్స్ చెక్ చేయకుండా..ఉద్దేశపూర్వకంగా తప్పుడు పిన్ ఎంటర్ చేయాలి. 
  • దీని వల్ల ఏవైనా పెండింగ్ లో ఉన్న లావాదేవీలు రద్దు చేయబడతాయి. 
  • అన్ వాంటెడ్ విత్ డ్రాలు జరగకుండా మీ ఖాతా సురక్షితంగా ఉంటుంది.