ఘిబ్లీ పిక్స్ కోసం చాట్ జీపీటీలో ఫొటోల అప్​లోడ్ సేఫ్ కాదు..ప్రైవసీ ఇష్యూస్ వచ్చే ప్రమాదం

ఘిబ్లీ పిక్స్ కోసం చాట్ జీపీటీలో ఫొటోల అప్​లోడ్ సేఫ్ కాదు..ప్రైవసీ ఇష్యూస్ వచ్చే ప్రమాదం
  • ఘిబ్లీ పిక్స్ కోసం చాట్ జీపీటీలో ఫొటోల అప్​లోడ్ సేఫ్ కాదు
  • ప్రైవసీ ఇష్యూస్ వచ్చే ప్రమాదం ఉందని నిపుణుల హెచ్చరిక

న్యూఢిల్లీ: ఓపెన్  ఏఐ చాట్  జీపీటీకి సంబంధించిన ఘిబ్లీ స్టైల్  ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఫొటోలు ప్రస్తుతం సోషల్  మీడియాలో చాలా వైరల్​గా మారాయి. రాజకీయ నాయకులు, సెలబ్రిటీల నుంచి సామాన్యుల వరకు తమ ఫొటోలను ఘిబ్లీ లెజెండ్ హయావో మియాజాకి సిగ్నేచర్  స్టైల్లో ఏఐ ఫొటోలుగా మార్చి షేర్  చేసుకుంటున్నారు. కొంతమంది మాత్రం ఈ తరహా ఫొటోలకు దూరంగా ఉంటున్నారు. వినియోగదారుల పర్సనల్  ఇమేజెస్ ను ఓపెన్  ఏఐ..

 ఏఐ ట్రైనింగ్  కోసం వాడే అవకాశం ఉందని, దీంతో ప్రైవసీ సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని డిజిటల్ పైరసీ యాక్టివిస్టులు హెచ్చరిస్తున్నారు. యూజర్లు తమ ఫొటోలను ఘిబ్లీ స్టైల్ గా మార్చి ఎంజాయ్  చేస్తున్నారని, వారికి తెలియకుండానే ఆ ఫొటోలను ఓపెన్  ఏఐ వాడుకునే అవకాశం ఉందని పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో ఇంటర్ నెట్ లో అలాంటి పిక్స్ ను స్క్రాప్  చేయాలని డిజిటల్  పైరసీ యాక్టివిస్టులు కోరుతున్నారు.

 ‘‘యూజర్ల పైరసీని కాపాడేందుకు అదనపు సేఫ్ గార్డ్స్ ను అమలు చేయాలి. వ్యక్తుల గోప్యతను కాపాడాలి. పారదర్శకత పాటించాలి. జవాబుదారీతనం మెయింటెయిన్ చేయాలి” అని ఆ యాక్టివిస్టులు సూచించారు. కాగా.. దీనిపై ఓపెన్  ఏఐ ఇంకా స్పందించాల్సి ఉంది.